ముంబై వీధుల్లో (mumbai roads) లవ్ బర్డ్స్ రెచ్చిపోయాయి. ప్రేమలో మునిగిపోయిన ఆ జంట బయటి ప్రపంచాన్ని మర్చిపోయి కదులుతున్న స్కూటీపై రొమాన్స్ చేసుకుంది (couple romancing on moving scooter in mumbai). దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ (video viral on social media)గా మారింది.
మహారాష్ట్రలోని ముంబైలో వీధుల్లో ఓ ప్రేమ జంట నడిరోడ్డుపైనే రెచ్చిపోయింది. స్కూటీపై రిస్కీ స్టంట్స్ తో రొమాన్స్ చేసుకున్నారు. ఒకనొకరు హగ్ చేసుకున్నారు. ముద్దులతో ముంచెత్తుకున్నారు. దీనిని ఆ రోడ్డు గుండా వెళ్లే పలువురు వీడియో తీశారు. దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇప్పుడది వైరల్ గా మారింది. అయితే ఈ వీడియోకు నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు
అది ముంబైలోని బాంద్రా రిక్లమేషన్ రోడ్. ఈ రోడ్డు ఎప్పుడూ వాహనాల రాకపోకలతో రద్దీగా ఉంటుంది. రెండు రోజుల కిందట ఈ రోడ్డుపై ఓ స్కూటీ వెళ్తోంది. యువకుడు స్కూటీ నడుపుతుండగా.. ఓ యువతి అతడికి ఎదురుగా, గట్టిగా హగ్ చేసుకొని కూర్చొంది. యువతి తన స్కార్ఫ్ తో అతడిని కప్పేసింది.
This daring duo was spotted at Bandra Reclamation, turning heads with their unconventional scooter ride. we kindly request your attention to ensure everyone's safety on the roads. 🛵 pic.twitter.com/mKrqCILXog
— Bandra Buzz (@bandrabuzz)
స్కూటీ రోడ్డుపై వెళ్తూనే ఉండగా.. వారిద్దరూ హగ్గులు, కిస్సులతో రొమాన్స్ చేసుకున్నారు. ఎంతో సంతోషంలో మునిగిపోయారు. ఆ ప్రేమ జంట మత్తులో మరో లోకంలో విహరిస్తూ.. తాము నడిరోడ్డుపై ఉన్నామనే సంగతి కూడా మర్చిపోయింది. ఈ చర్య సామాజిక నిబంధనలను ఉల్లంఘించడమే కాకుండా, రోడ్డు భద్రతా నిబంధనలు కూడా ఉల్లంఘించింది. ఎందుకంటే ఇద్దరూ హెల్మెట్ ధరించకపోగా.. రోడ్డుపై అసభ్యకరంగా ప్రవర్తించారు.
అయితే వీరి చర్యను అటుగా వెళ్తున్న ఓ ప్రయాణికుడు తన సెల్ ఫోన్ లో రికార్డు చేశాడు. అనంతరం దానిని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు. తరువాత ‘బాంద్రా బజ్’ అనే ఎక్స్ (ట్విట్టర్) హ్యాండిల్ లో షేర్ అయ్యింది. ‘‘ఈ సాహసోపేత జంట బాంద్రా రెక్లమేషన్ వద్ద తమ అసాధారణమైన స్కూటర్ రైడ్ తో కనిపించారు.’’ అని క్యాప్షన్ పెట్టారు. దీనికి ముంబై పోలీసును ట్యాగ్ చేశారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. పలువురు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు వెంటనే దీనిపై జోక్యం చేసుకోవాలని కోరారు. కానీ కొందరు ప్రేమికులకు మద్దతుగా నిలిచారు. కాగా.. రద్దీగా ఉండే వీధిలో ఇలాంటి ఘటన జరగడం ఇదే తొలిసారి కాదు. గత ఏడాది కూడా ఢిల్లీ రోడ్లపై స్కూటీపై వెళ్తున్న ఓ ప్రేమ జంట ఇలాంటి చర్యకే ఒడిగట్టింది. ఓ జంట ఒకరినొకరు కౌగిలించుకొని రొమాన్స్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.