ఇన్‌స్టా పరిచయంతో సహజీవనం.. పాట్నర్‌‌ను కత్తితో పొడిచిన యువతి.. అసలేం జరిగిందంటే..

Published : Aug 14, 2022, 03:44 PM IST
ఇన్‌స్టా పరిచయంతో సహజీవనం.. పాట్నర్‌‌ను కత్తితో పొడిచిన యువతి.. అసలేం జరిగిందంటే..

సారాంశం

కర్ణాటకలో ఓ యువతి దారుణానికి ఓడిగట్టింది. చిన్న గొడవల కారణంగా సహజీనం చేస్తున్న వ్యక్తిని కత్తితో పొడిచింది. ఈ ఘటనకు సంబంధించి ఆ యువతిని అరెస్ట్ చేసినట్టుగా కర్ణాటక పోలీసులు ఆదివారం తెలిపారు. 

కర్ణాటకలో ఓ యువతి దారుణానికి ఓడిగట్టింది. చిన్న గొడవల కారణంగా సహజీనం చేస్తున్న వ్యక్తిని కత్తితో పొడిచింది. ఈ ఘటనకు సంబంధించి ఆ యువతిని అరెస్ట్ చేసినట్టుగా కర్ణాటక పోలీసులు ఆదివారం తెలిపారు. అరెస్ట్ చేసిన మహిళను కొడగుకు చెందిన 22 ఏళ్ల అశ్వితగా, బాధితుడు హసన్‌కు చెందిన 25 ఏళ్ల మహేష్‌గా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అశ్విత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండేది. అశ్విత, మహేష్ రెండున్నరేళ్ల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరికొకరు పరిచయం అయ్యారు. మహేష్‌తో కలిసి ఉండేందుకు అశ్విత తన కుటుంబాన్ని విడిచిపెట్టింది. మరోవైపు ఈ విషయం కుటుంబ సభ్యులకు చెప్పిన మహేష్.. అశ్వితతో కలిసి జీవనం సాగిస్తున్నాడు. 

అశ్విత్, మహేష్ బెంగళూరులోని హుళిమావు పరిధిలోని కృష్ణా లేఅవుట్‌లో ఇల్లు అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నారు. మహేష్ ఫుడ్ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. అశ్విత ఇంట్లోనే ఉంటూ మొబైల్ ఫోన్‌తో ఎక్కువగా గడిపేది. ఇతరులతో చాలా సమయం ఫోన్‌లో మాట్లాడేది  అయితే దీనిపై అశ్వితను మహేష్ ప్రశ్నించిన సమయంలో.. ఇద్దరి మధ్య గొడవ జరిగేది. ఆగస్టు 6వ తేదీన అశ్విత మొబైల్ ఫోన్ చాట్‌లపై మహేష్ ప్రశ్నించారు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే ఆవేశానికి లోనైన అశ్విత.. మహేష్‌పై కత్తితో దాడి చేసింది. ఛాతీ, మెడపై పలుమార్లు పొడిచింది. దీంతో ఇంటి నుంచి బయటకు పరుగెత్తిన మహేష్ పక్క ఇంట్లో ఆశ్రయం పొందాడు. అనంతరం ఆస్పత్రిలో చేరాడు.

ఈ ఘటనకు సంబంధించి పోలీసులు అశ్వితను శనివారం అదుపులోకి తీసుకున్నారు. అయితే రెండో పెళ్లి చేసుకున్న తన తల్లితో కలిసి జీవించడం ఇష్టం లేక.. మహేష్‌తో కలిసి ఉంటున్నట్టుగా అశ్విత ఆరోపించింది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Indian Population in USA: అమెరికాలో ఇండియన్స్ అడ్డా.. ఈ 5 నగరాల్లోనే ఎక్కువ మంది.. ఎందుకో తెలుసా?
చెన్నై లో నూతన భవనాలను ప్రారంభించిన సీఎం విజయ్ | CM C. Joseph Vijay Visits Perambur