ప్రపంచం ఇప్పుడు భారత్ వైపే చూస్తోంది : ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్

Siva Kodati |  
Published : Aug 14, 2022, 03:25 PM IST
ప్రపంచం ఇప్పుడు భారత్ వైపే చూస్తోంది : ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్

సారాంశం

ప్రపంచం ఇప్పుడు భారత్ వైపు చూస్తోందన్నారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్. ‘‘భారత్@2047 : మై విజన్ మై యాక్షన్’’ అనే పేరుతో నాగపూర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని పై విధంగా వ్యాఖ్యానించారు. 

ప్రపంచం మొత్తం వైరుధ్యాలతో నిండిపోయిందని.. కానీ ఈ భిన్న వైరుధ్యాలను నిర్వహించడం భారత్‌కు మాత్రమే సాధ్యమన్నారు (rashtriya swayamsevak sangh) రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ (mohan bhagwat) . ‘‘భారత్@2047 : మై విజన్ మై యాక్షన్’’ అనే పేరుతో నాగపూర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆదివారం మోహన్ భగవత్ పాల్గొన్నారు. దేశంలో గతంలో ఎన్నో చారిత్రక ఘటనలు జరిగినప్పటికీ.. వాటిని మనకు చెప్పలేదని, సరైన విధంగా వివరించలేదని ఎద్దేవా చేశారు. 

ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపే చూస్తున్నాయని భగవత్ అన్నారు. మన సొంత జ్ఞానాన్ని మరిచిపోయామని.. తర్వాత దేశ వాయువ్య ప్రాంతం నుంచి విదేశీయులు మన దేశ భూభాగాన్ని ఆక్రమించుకున్నారని మోహన్ భగవత్ గుర్తుచేశారు. పని కోసం ఏర్పడ్డ వ్యవస్థలు చివరికి విభజన, వర్గాలుగా మారేందుకు దారి తీసిందని.. వేషభాషలు, వస్త్రధారణ విషయంలోనూ తేడాలు చోటు చేసుకున్నాయని ఆయన తెలిపారు. దేశంలోని భాషలన్నీ జాతీయ భాషలేనన్న ఆయన.. ఏ కులానికి చెందిన వారైనా తమవారేనని పేర్కొన్నారు. 

Also REad:RSS Tiranga DP: ప్రొఫైల్ పిక్ ను మార్చిన ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్‌.. విప‌క్షాల విమ‌ర్శ‌ల‌కు పుల్ స్టాప్

కాగా.. ప్రధాని మోదీ ‘హర్ ఘర్ తిరంగ’ (har ghar tiranga) ప్రచారాన్ని ప్రారంభించారు. అమృత్ మహోత్సవ్ కింద ఆగస్టు 13 నుంచి 15 వరకు ప్రతి ఇంటిలో త్రివర్ణ పతాకాన్ని ఎగ‌ర‌వేయాల‌ని తెలిపారు. అలాగే..  ఇందులోభాగంగా.. ప్ర‌తిఒక్క‌రూ త‌మ‌ సోషల్ మీడియా ఖాతాల డిపిని అంటే డిస్ప్లే చిత్రాన్ని మార్చి.. దాని స్థానంలో త్రివర్ణాన్ని పెట్టాలని తెలిపారు. ఈక్ర‌మంలో ప్రధాని తన ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి సోష‌ల్ మీడియా ఖాతాల డిస్ల్పే చిత్రాన్ని మార్చారు. 
  
సంఘ్, విహెచ్‌పిల సోష‌ల్ మీడియా ఖాతాల‌ డిపిలో త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శించకపోవడంతో ప్రతిపక్షాలు ఈ అవకాశాన్ని వృథా చేయదలచుకోలేదు. భారత జెండాతో ఆర్‌ఎస్‌ఎస్‌కు ఉన్న బలహీన సంబంధాన్ని ఆయన ప్రజల దృష్టిని ఆకర్షించారు. 52 ఏళ్లుగా ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేయలేదని, దానిని అవమానించారని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. దీంతో ప్ర‌తిప‌క్షాల విమ‌ర్శ‌ల‌కు పుల్ స్టాప్ పెడుతూ.. ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్, ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబోలే తమ సోషల్ మీడియా ఖాతాల ప్రోఫైల్ పిక్ గా త్రివర్ణ పతాకాన్ని ఉంచారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

MICE పథకం.. ఈ రంగంలో గేమ్‌ చేంజర్
రైళ్లలో ఇకపై లగేజీకి ఛార్జీలు:Ashwini Vaishnaw on Indian Railway Luggage Rules | Asianet News Telugu