2020 గాల్వాన్ ఘటన తరువాత ఎల్ఏసీ దగ్గర భారత్, చైనాలకు రెండుసార్లు ఘర్షణ జరిగిందా?

By SumaBala BukkaFirst Published Jan 17, 2024, 9:58 AM IST
Highlights

ఈ వీడియోలోని బ్యాక్ గ్రౌండ్ వాయిస్ లో చెబుతున్న సంఘటనలు సెప్టెంబర్ 2021, నవంబర్ 2022 మధ్య జరిగినట్టుగా ఉన్నాయి. 

న్యూఢిల్లీ: లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (ఎల్ఏసీ) వెంబడి భారత్, చైనా సైనికుల మధ్య ఇంతకుముందు వెలుగుచూడని రెండు పోరాట సంఘటనలు భారత ఆర్మీ సిబ్బందికి ప్రదానం చేసిన శౌర్య అవార్డుల ప్రస్తావనలతో ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి.

గత వారం ఆర్మీ వెస్ట్రన్ కమాండ్ ఇన్వెస్టిచర్ వేడుకలో ఇవి వెలుగు చూశాయి. ఎల్ఏసీ వెంబడి చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సైనికుల దూకుడు ప్రవర్తనకు భారత దళాలు ఎలా తిప్పికొట్టాయో తెలిపాయి. చండీమందిర్‌లో ఆర్మీ వెస్ట్రన్ కమాండ్ ప్రధాన కార్యాలయం ఉంది. జనవరి 13న ఇక్కడ జరిగిన వేడుకల వీడియోను వెస్ట్రన్ కమాండ్ తన యూట్యూబ్ ఛానెల్‌లో పోస్ట్ చేసింది. ఇందులో గ్యాలంటరీ అవార్డుపై వ్యాఖ్యానం కూడా ఉంది. ఆ తరువాత ఎందుకో ఈ ఛానల్ ను డీయాక్టివేట్ అయ్యింది.

Latest Videos

Global Military Ranks: ప్రపంచ దేశాల ఆర్మీ ర్యాంకింగ్ విడుదల.. ఇండియా ర్యాంక్ ఎంతంటే?

వీటిల్లో పేర్కొన్న సంఘటనలు సెప్టెంబర్ 2021, నవంబర్ 2022 మధ్య జరిగాయి. ఈ విషయంపై ఆర్మీ తక్షణమే ఏమీ వ్యాఖ్యానించలేదు. జూన్ 2020లో గాల్వాన్ వ్యాలీలో జరిగిన ఘర్షణల తర్వాత 3,488 కి.మీ-పొడవు ఎల్ఏసీ వెంబడి భారత సైన్యం పోరాటానికి ఎప్పుడూ సంసిద్ధంగా ఉంటోంది. 
మే 2020లో తూర్పు లడఖ్ సరిహద్దు వరుస విస్ఫోటనం తర్వాత గత మూడున్నరేళ్లలో ఎల్ఏసీ వెంట భారత్, చైనా దళాల మధ్య అనేక వాగ్వివాదాలు జరిగాయి.

ఎల్ఏసీ, తవాంగ్ సెక్టార్‌లో కూడా చైనా దళాలు అతిక్రమించడానికి ప్రయత్నించాయి. డిసెంబర్ 9, 2022న, తవాంగ్ సెక్టార్‌లోని యాంగ్ట్సే ప్రాంతంలో పీఎల్ఏ దళాలు ఎల్ఏసీని అతిక్రమించడానికి ప్రయత్నించాయి. ఏకపక్షంగా యథాతథ స్థితిని మార్చేశాయి. సంఘటన జరిగిన నాలుగు రోజుల తర్వాత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ విషయాన్ని పార్లమెంటులో ప్రస్తావించారు. 

చైనా చేసిన ఈ దూకుడు ప్రయత్నాన్ని భారత సైనికులు దృఢంగా ఎదుర్కొన్నారని రాజ్ నాథ్ సింగ్ చెప్పారు. చైనీస్ అతిక్రమణపై బలంగా తిప్పికొట్టిన బృందంలో భాగమైన పలువురు భారతీయ ఆర్మీ సిబ్బందికి  వేడుకలో గ్యాలంట్రీ అవార్డులు కూడా ప్రదానం చేసినట్లు పీటీఐ వర్గాలు తెలిపాయి.

"ఆ తరువాత ఇది ముఖాముఖి భౌతిక ఘర్షణకు దారితీసింది, దీనిలో భారత సైన్యం పీఎల్ఏని మన భూభాగంలోకి చొరబడకుండా ధైర్యంగా నిరోధించింది. వారిని వారి ప్రాంతానికి తిరిగివెళ్లేలా చేసింది" అని రాజ్ నాథ్ సింగ్ ఆ సంవత్సరం డిసెంబర్ 13న చెప్పారు.ఈ ఘర్షణలో ఇరువైపులా కొంతమంది సిబ్బందికి గాయాలయ్యాయని తెలిపారు.

"మన ప్రాదేశిక సమగ్రతను పరిరక్షించడానికి మా బలగాలు కట్టుబడి ఉన్నాయని, దానిపై చేసే ఏ ప్రయత్నాన్నైనా అడ్డుకుంటామని.. నేను ఈ సభకు హామీ ఇస్తున్నాను. మన సైనికుల ధైర్య ప్రయత్నానికి మద్దతుగా ఈ సభ మొత్తం ఐక్యంగా నిలుస్తుందని నేను విశ్వసిస్తున్నాను" అని సింగ్ అన్నారు.

click me!