ఓ వ్యక్తి అంత్యక్రియల్లో పాల్గొన్న 20 మందికి కరోనా సోకింది. దీంతో ఈ ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించారు అధికారులు. ఈ ఘటన బీహార్ రాష్ట్రంలో చోటు చేసుకొంది.
పాట్నా: ఓ వ్యక్తి అంత్యక్రియల్లో పాల్గొన్న 20 మందికి కరోనా సోకింది. దీంతో ఈ ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించారు అధికారులు. ఈ ఘటన బీహార్ రాష్ట్రంలో చోటు చేసుకొంది.
బీహార్ రాష్ట్రంలోని బిహ్తా ప్రాంతంలో జరిగింది. ఆదివారం నాడు ఈ ప్రాంతంలో 20 మందికి కరోనా సోకింది. వ్యాపారవేత్త రాజ్ కుమార్ గుప్తా ఈ నెల 10వ తేదీన అనారోగ్యంతో మరణించాడు. వ్యాపారవేత్త రాజ్ కుమార్ మేనల్లుడితో పాటు కుటుంబంలో మరొకరికి కరోనా సోకింది. అంతేకాదు అంత్యక్రియల్లో పాల్గొన్న మరో 18 మందికి కూడ కరోనా నిర్ధారణ అయినట్టుగా అధికారులు ప్రకటించారు.
undefined
also read:కర్ణాటక పర్యాటక శాఖ మంత్రి సీటీ రవికి కరోనా: భార్యకు నెగిటివ్
బిహ్తా ప్రాంతంలో ఆదివారం నాడు ఒకేసారి 20 కరోనా కేసులు నమోదు కావడంతో ఈ ప్రాంతాన్ని శానిటైజ్ చేశారు అధికారులు.వ్యాపారవేత్త రాజ్ కుమార్ అంత్యక్రియల్లో 37 మంది పాల్గొన్నారు. వీరిని పరీక్షిస్తే 20 మందికి కరోనా సోకింది. బీహార్ రాష్ట్రంలో 16,642 కేసులు నమోదయ్యాయి. ఇందులో 5001 యాక్టివ్ కేసులు. కరోనాతో రాష్ట్రంలో ఇప్పటివరకు 143 మంది మరణించారు.