Drugs Smuggling: కడుపులో 181 కొకైన్‌ క్యాప్సూల్స్ .. వాటి విలువ తెలిస్తే.. దిమ్మ‌తిరగాల్సిందే !

By Rajesh KFirst Published May 28, 2022, 3:25 AM IST
Highlights

 Drugs Smuggling: రెండు వేర్వేరు కేసుల్లో కొకైన్ స్మగ్లింగ్ చేస్తున్న ఇద్దరు ఉగాండా మహిళలను ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. వారు నిషిద్ధ వస్తువులను తీసుకున్నారని అనుమానంతో ప‌రీక్షించ‌గా.. క‌డుపులో దాటి పెట్టుకుని వ‌చ్చిన 28 కోట్ల రూపాయల విలువైన 181 క్యాప్సూల్స్ ను స్వాధీనం చేసుకున్నారు.

Drugs Smuggling: మత్తు ప‌దార్థాల అక్ర‌మ ర‌వాణాను అరికట్టేందుకు విమానాశ్రయం సిబ్బంది, కస్టమ్స్‌ అధికారులు ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా.. ఆ డ్ర‌గ్స్ మాఫియా ఏమాత్రం తగ్గడం లేదు. సినిమాల్లో చూపించే విధంగానే బంగారం, డ్రగ్స్‌ను అక్రమంగా రవాణాకు కొత్త కొత్త మార్గాలను అనుస‌రిస్తున్నారు. పొట్టలో, మలమూత్ర విసర్జన చేసే ప్రదేశాల్లో డ్రగ్స్‌ను పెట్టుకుని వచ్చి అడ్డంగా దొరికిపోతున్నారు. 

తాజాగా.. ఉగాండా నుంచి వచ్చిన ఇద్దరు మహిళలను ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఐజీఐ విమానాశ్రయం)లో అరెస్టు చేశారు. వారు నిషేధిత ప‌దార్థాల‌ను మింగిన‌ట్టు అధికారులు గుర్తించారు. వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా.. వారి క‌డుపులో డ్ర‌గ్స్ క్యాప్సూల్స్ ఉన్న‌ట్టు గుర్తించారు. వైద్యుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో బయటకు తీయగా.. ఆ క్యాప్సూల్స్ లో కొకైన్ ఉన్న‌ట్టు తేలింది. ఇలా వారి క‌డుపులో నుంచి మొత్తం 28 కోట్ల రూపాయల విలువైన 181 క్యాప్సూల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.
 
కస్టమ్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మే 22న ఉగాండాకు చెందిన ఓ మహిళ ఢిల్లీ విమానాశ్రయంలో దిగింది. అనుమానాస్పద స్థితిలో ఆమెని పట్టుకోగా.. శరీరంలో మత్తు పదార్థాలు దాచుకున్నట్లు గుర్తించారు. మహిళను ఆర్‌ఎంఎల్‌ ఆస్పత్రికి తీసుకెళ్లి ఎక్స్‌రే చేయగా కడుపులో 100 క్యాప్సూల్స్‌ ఉన్నట్లు తేలింది. వైద్యుల పర్యవేక్షణలో ఈ క్యాప్సూల్స్‌ను బయటకు తీయగా.. అందులో కొకైన్ బయటికి వచ్చింది. దీని మొత్తం బరువు 957 గ్రాములు కాగా అంతర్జాతీయ మార్కెట్‌లో దీని ధర రూ.14.35 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

అదే విధంగా మే 26న ఉగాండాకు చెందిన మరో మహిళ ఢిల్లీ విమానాశ్రయంలోని గ్రీన్ ఛానల్ దాటుతుండగా అనుమానాస్పదంగా పట్టుకున్నారు. తన కడుపులో 81 కొకైన్ క్యాప్సూల్స్ దాగి ఉన్నాయని ఆ మహిళ స్వయంగా చెప్పింది. ఈ మహిళను RML ఆసుపత్రికి తీసుకెళ్లారు, అక్కడ ఆమె కడుపులో నుండి 891 గ్రాముల బరువున్న 81 క్యాప్సూల్స్ బయటకు తీశారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ఈ కొకైన్ ధర సుమారు 13.6 కోట్లు ఉంటుంద‌ని అధికారులు అంచనా వేశారు. ఈ డ్ర‌గ్స్ నెట్‌వర్క్‌ను ఎవరు నడుపుతున్నారు? ఎక్కడి నుండి నడుపుతున్నారు? మహిళలు తమ కడుపులో దాచిపెట్టిన కొకైన్‌ను ఎవరు డెలివరీ చేస్తారో?  తెలుసుకోవడానికి అధికారులు ఇప్పుడు ప్రయత్నిస్తున్నారు. 

అదే సమయంలో, ఢిల్లీ విమానాశ్రయంలో కస్టమ్స్ డిపార్ట్‌మెంట్ మరో చర్యలో 76 లక్షలకు పైగా విలువైన బంగారాన్ని ప‌ట్టుకుంది. ఈ కేసులో రియాద్ నుంచి వ‌స్తున్న ఒక భారతీయుడి ఎయిర్‌పోర్ట్ హెల్త్ ఆర్గనైజేషన్‌లోని ఇద్దరు ఉద్యోగులను అరెస్టు చేశారు. వారి నుంచి 14 బంగారు బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నారు.  అవి 1632 గ్రాములు ఉన్నాయ‌నీ, 76 లక్షలకు పైగా ఖరీదు చేస్తాయని అధికారుల అంచ‌నా. 

click me!