Navneet Rana arrest: మహారాష్ట్ర చీఫ్ సెక్రటరీ, డీజీపీల‌కు ప్రివిలేజ్ కమిటీ సమన్లు

By Rajesh KFirst Published May 28, 2022, 1:42 AM IST
Highlights

Navneet Rana arrest: నవనీత్ రాణా అరెస్ట్ అంశం మరింత వేడెక్కింది. పార్లమెంటరీ కమిటీ ముంబై పోలీస్ కమిషనర్‌కు నోటీసు పంపింది. అలాగే మహారాష్ట్ర డిజిపిని ఢిల్లీకి రావాల‌ని ఆదేశించింది. జూన్ 15న మధ్యాహ్నం 12.30 గంటలకు ఎంపీ నవనీత్ రాణా చేసిన ఫిర్యాదుపై విచార‌ణ జ‌రుగ‌నున్న‌ది. పోలీసుస్టేష‌న్ లో తన పట్ల అనుచితంగా  వ్యవహరించార‌ని నవనీత్ రాణా తన ఫిర్యాదులో పేర్కొంది.

Navneet Rana arrest: ఇటీవల హనుమాన్ చాలీసా వివాదం కేసులో అక్రమంగా అరెస్టు చేసి జైలులో  అమానవీయంగా ప్రవర్తించారంటూ అమరావతి ఎంపీ నవనీత్ రాణా, ఆమె ఎమ్మెల్యే భర్త రవి లు లోక్‌సభ సెక్రటేరియట్‌లోని ప్రివిలేజెస్ అండ్ ఎథిక్స్ కమిటీ ఫిర్యాదు చేసిన విష‌యం తెలిసిందే. రాణా ఫిర్యాదు మేరకు ప్రివిలేజెస్ అండ్ ఎథిక్స్ కమిటీ శుక్రవారం మహారాష్ట్ర చీఫ్‌కు సమన్లు ​​పంపింది. 

ఈ ఫిర్యాదులో విచార‌ణ కోసం జూన్ 15న  సెక్రటరీ మను కుమార్ శ్రీవాస్తవ. మహారాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) రజనీష్ సేథ్, ముంబై పోలీస్ కమిషనర్ సంజయ్ పాండే, మహిళా జిల్లా జైలు సూపరింటెండెంట్, బైకుల్లా (ముంబై) యశ్వంత్ భానుదాస్‌లను తమ ముందు హాజరుకావాలని కమిటీ సమన్లు ​​పంపినట్లు ఏఎన్‌ఐ నివేదించింది. జైలులో ముంబై పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని, ఆమెను అక్రమంగా అరెస్టు చేశారని నవనీత్ రాణా ఫిర్యాదుపై స్పందించారు

అమరావతి ఎంపీ నవనీత్ రాణా అధికార ఉల్లంఘన ఆరోపణలపై పార్లమెంట్ ప్రివిలేజెస్ అండ్ ఎథిక్స్ కమిటీకి లేఖ రాశారు. ఖార్ పోలీస్ స్టేషన్‌లో తనను అక్రమంగా అరెస్టు చేశారని, అమానవీయంగా ప్రవర్తించారని ఆరోపించారు. ఈ మేర‌కు మే 23న నవనీత్  పార్లమెంటరీ ప్రివిలేజ్ కమిటీ ఫిర్యాదు చేసింది.  

ఎంపీ నవనీత్ రాణా ఆరోపణలను ఖండించేందుకు ముంబై పోలీస్ కమిషనర్ సంజయ్ పాండే తన ట్విట్టర్ హ్యాండిల్ నుండి ఒక వీడియోను ట్వీట్ చేశారు. ఈ వీడియోలో నవనీత్ రానా పోలీస్ స్టేషన్‌లో టీ తాగుతున్నట్లు చూపించారు. అయితే తర్వాత రానా దంపతులు స్పందిస్తూ సంజయ్ పాండే ఖార్ పోలీస్ స్టేషన్ వీడియోను విడుదల చేశారనీ, కాగా శాంతా క్రజ్ పోలీస్ స్టేషన్‌లో అసభ్యంగా ప్రవర్తించార‌ని ఆరోపించారు.

బాంద్రాలోని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ఇంటి ముందు హనుమాన్ చాలీసా పారాయణం చేస్తామని ప్రకటించిన రానా దంపతులను ఏప్రిల్ 23న ముంబైలోని వారి నివాసం నుంచి అరెస్టు చేశారు. దేశద్రోహం, శత్రుత్వాన్ని ప్రోత్సహించడం, విధులు నిర్వర్తించకుండా ఉండేందుకు ప్రభుత్వోద్యోగిపై దాడి చేయడం వంటి అభియోగాలపై  వీరిపై కేసు నమోదు చేశారు. ఈ జంట తరువాత బెయిల్‌పై విడుదలయ్యారు. 

ఎంపీ నవనీత్ రాణా జైలు నుంచి విడుదలైన రెండో రోజే వెన్నునొప్పి కారణంగా లీలావతి ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. ఆస్పత్రి నుంచి విడుదలయ్యాక.. వెన్నునొప్పి ఉందని తెలిసినా జైలు అధికారులు నేలపై కూర్చొని నిద్రపోయేలా చేశారని రానా దంపతులు ఆరోపించారు. దీంతో ఆమెకు నొప్పి మరింత పెరిగి ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. నవనీత్ రానా పదేపదే విజ్ఞప్తి చేసినప్పటికీ, ఆసుపత్రికి తీసుక‌పోలేద‌ని ఆరోపించారు. ఈ ఫిర్యాదులన్నీ నవనీత్ రాణా లోక్‌సభకు ఇవ్వడంతో అందరి చూపు దీనిపైనే ఉంది.

click me!