జమ్మూ కశ్మీర్ లో ఎన్ కౌంటర్... ఇద్దరు ఉగ్రవాదులు హతం

Published : Feb 13, 2019, 09:32 AM IST
జమ్మూ కశ్మీర్ లో ఎన్ కౌంటర్... ఇద్దరు ఉగ్రవాదులు హతం

సారాంశం

జమ్మూకశ్మీర్ సరిహద్దుల్లో భద్రతాబలగాలు, తీవ్రవాదులకు మధ్య భీకర పోరు జరిగింది.

జమ్మూకశ్మీర్ సరిహద్దుల్లో భద్రతాబలగాలు, తీవ్రవాదులకు మధ్య భీకర పోరు జరిగింది. టెర్రరిస్టులపై భద్రతా బలగాలు జరిగిన ఎన్‌కౌంటర్ లో ఇద్దరు టెర్రరిస్టులు హతం అయ్యారు. తీవ్రవాదుల మృతదేహాలతోపాటు ఆయుధాలను ఎన్‌కౌంటర్ స్థలంలో స్వాధీనం చేసుకున్నారు. 

గోపాల్ పొర ప్రాంతంలో భద్రతా బలగాలు మంగళవారం  రాత్రి వేళ తీవ్రవాదులు ఉన్నారనే సమాచారం మేరకు గాలింపు చర్యలు  చేపట్టారు. కాగా.. భద్రతాబలగాలపై తీవ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో భారత జవాన్లు సైతం ఎదురుకాల్పులు జరపాల్సి వచ్చింది. ఈ కాల్పుల్లో  ఇద్దరు టెర్రరిస్టులు మరణించారు. తీవ్రవాదుల వద్ద పేలుడు పదార్థాలు పెద్దఎత్తున స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

సంక్రాంతికి కిచిడీ మేళా.. ఈ ఆలయంలో విచిత్రమైన ఆచారం
Gold Rate : గూగుల్, న్యూస్ ధరలు కాదు.. రియల్ టైమ్ బంగారం రేటు కచ్చితంగా తెలుసుకోవడం ఎలాగంటే..