అనంత్‌నాగ్‌లో ఉగ్ర‌వాదుల ఏరివేత‌.. ఇద్ద‌రు ఉగ్ర‌వాదుల హ‌తం.. కొన‌సాగుతున్న ఆప‌రేష‌న్ 

Published : Oct 10, 2022, 09:32 AM IST
అనంత్‌నాగ్‌లో ఉగ్ర‌వాదుల ఏరివేత‌.. ఇద్ద‌రు ఉగ్ర‌వాదుల హ‌తం.. కొన‌సాగుతున్న ఆప‌రేష‌న్ 

సారాంశం

జమ్ముకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్ద‌రు ఉగ్రవాదులు హతమయ్యాడు. కొకెర్‌నాగ్‌ ప్రాంతంలోని తంగ్‌పవా వద్ద ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో భద్రతా దళాలు, స్థానిక పోలీసులు కార్డ్ అండ్ సెర్చ్ నిర్వ‌హించారు. ఈ క్ర‌మంలో ఎన్ కౌంట‌ర్ జ‌రిగింది.   

దేశంలో శాంతిభద్రతలకు విఘాతం కల్పించాల‌ని ఉగ్ర‌వాదులు అక్ర‌మ చొరబాట్లకు పాల్ప‌డుతున్నారు. ప్ర‌ధానంగా జమ్మూకాశ్మీర్ లో భద్రతా బలగాలకు, ఉగ్ర‌వాదుల‌కు మధ్య నిత్యం ఏదోక ఘ‌ర్ష‌ణ జ‌రుగుతూనే ఉంది.  క్ర‌మంలో ఇరువ‌ర్గాల‌ మ‌ధ్య‌ ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతూనే ఉంది. దీంతో అప్ర‌మ‌త్త‌మైన  భద్రతా బలగాలు క్ర‌మంగా నిఘా పెంచుతున్నాయి. వాస్తవాధీన రేఖ వెంబడి నిత్యం పహారా కాస్తూ.. అనుమానిత ప్రాంతాల్లో సోదాలు చేశాయి. ఉగ్రవాదులను ఏరివేస్తున్నాయి.
 
ఈ క్ర‌మంలో జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో సోమవారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్ జ‌రిగింది. ఈ ఎన్ కౌంట‌ర్ లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. కొకెర్‌నాగ్‌ ప్రాంతంలోని తంగ్‌పవా వద్ద ఉగ్రవాదులు ఉన్నారనే నిఘావ‌ర్గాల సమాచారం అందించాయి. ఈ స‌మాచారం మేర‌కు భద్రతా దళాలు ఆదివారం రాత్రి  ఆ ప్రాంతంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వ‌హించారు. 

సెర్చ్ ఆపరేషన్ సమయంలో ఉగ్రవాదులు భద్రతా బలగాలపై కాల్పులు జరిపారని, ఆ తర్వాత బలగాలు కూడా ఎదురుకాల్పులు జరిపాయని, ఇలా ఎన్‌కౌంటర్ ప్రారంభమైందని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో సోమవారం తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమైనట్లు అధికారులు తెలిపారు. ఆ ప్రాంతంలో ఇంకా ఆపరేషన్‌ కొనసాగుతున్నదని వెల్లడించారు. చ‌నిపోయిన ఉగ్ర‌వాదులు ఏ ఉగ్రవాద సంస్థకు చెందినవాడనేది ఇంకా గుర్తించాల్సి ఉన్నదని చెప్పారు.

PREV
click me!

Recommended Stories

Nitin Nabin : బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మోదీ నమ్మిన బంటు.. ఎవరీ నితిన్ నబిన్?
Indian Railways : ఇండియన్ రైల్వే బంపర్ ఆఫర్.. తక్కువ ఖర్చుతో దేశమంతా తిరిగేయండిలా !