కుక్క అనుకుని నక్కను పెంచుకున్నారు.. ఆరునెలల తరువాత ఊళ పెడుతుండడంతో షాక్ అయ్యి...

Published : Oct 10, 2022, 09:16 AM IST
కుక్క అనుకుని నక్కను పెంచుకున్నారు.. ఆరునెలల తరువాత ఊళ పెడుతుండడంతో షాక్ అయ్యి...

సారాంశం

ఓ కుటుంబం కుక్క అనుకుని నక్కను పెంచుకుంది. ఆరు నెలల తరువాత అది మొరగకుండా ఊళ పెడుతుండడంతో షాక్ అయ్యి.. అది నక్క అని తెలుసుకున్నారు. ఆ తరువాత.. 

బెంగళూరు :  బెంగళూరులో ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. కింగేరిలో ఉంటున్న ఒక కుటుంబ సభ్యులకు కుక్కలు అంటే చాలా ఇష్టం. ఇదే ప్రేమతో తమకు దొరికిన ఒక కుక్కపిల్లను ఇంటికి తీసుకువచ్చారు. ఆరు నెలలుగా దాన్ని ప్రేమగా సాకుతూ..  ఇంట్లోని మనిషిగా చూసుకున్నారు. వయసు పెరిగే కొద్దీ  అది మొరగడం లేదు.. అంతేకాకుండా విచిత్రమైన శబ్దం చేస్తూ ఉంది. వారి ఇంటికి వచ్చిన వారు, చుట్టుపక్కల వారు దాన్నిచూసి మీ కుక్క.. నక్క లాగా ఉంది ఏంటి అన్నా వారు పట్టించుకోలేదు.  

ఆ తర్వాత కొద్ది రోజులకే అది ఊళ వేస్తుండడంతో తమ వద్ద ఉన్నది కుక్క కాదని… నక్క అని తెలుసుకున్నారు. దీనికి తోడు అది పాలు తాగకపోవడం.. మాంసాహారాన్ని ఇష్టంగా తినడం చూసి.. దానిని నక్క అని  కన్ఫామ్ చేసుకున్నారు. ప్రాణిదయా సంఘం ప్రతినిధులకు చెప్పడంతో నగర శివార్లలోని అటవీ విభాగంలో దానిని వదిలి పెట్టి వచ్చారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం