కేరళ వాయనాడ్‌లో ఎదురుకాల్పలు: పోలీసుల అదుపులో అనుమానిత మావోలు

By narsimha lodeFirst Published Nov 8, 2023, 10:01 AM IST
Highlights

కేరళ రాష్ట్రంలో  మావోయిస్టుల అలజడి ప్రారంభమైంది.దీంతో రాష్ట్ర ప్రభుత్వం అలెర్ట్ అయింది.  

తిరువనంతపురం: కేరళ రాష్ట్రంలోని వాయనాడులో  మంగళవారంనాడు రాత్రి పోలీసులకు మావోయిస్టులుగా అనుమానిస్తున్నవారికి  మధ్య  కాల్పులు  చోటు చేసుకున్నాయి.  వాయనాడ్ లోని  తాళ్లప్పుజా  అటవీ ప్రాంతంలో  ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఎదురు కాల్పలు తర్వాత  ఇద్దరు అనుమానితులను పోలీసులు  అదుపులోకి తీసుకున్నారు.

సోమవారంనాడు కోజికోడ్ జిల్లాలో  పట్టుబడిన మావోయిస్టు సానుభూతిపరుడి నుండి వచ్చిన సమాచారం ఆధారంగా  పోలీసులు  కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించారు. పోలీసుల కూంబింగ్ ఆపరేషన్ ను గుర్తించిన  మావోయిస్టులు  కాల్పులకు దిగారు.  దీంతో  పోలీసులు కూడ ఎదురు కాల్పులు ప్రారంభించాయి.  పోలీసుల ఎదురు కాల్పుల నుండి తప్పించుకొని కొందరు మావోయిస్టులు తప్పించుకున్నారు.

అయితే ఇద్దరు మావోయిస్టులను  పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వారిని  చంద్రు,  ఉన్నిమయగా గుర్తించారు.  వీరిని  మావోయిస్టు పార్టీ  బస్సురదళానికి చెందిన సభ్యులుగా  పోలీసులు అనుమానిస్తున్నారని ప్రముఖ దినపత్రిక హిందూ తెలిపింది. వీరి నుండి ఏకే 47, బుల్లెట్లను  పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

కంబాలాతో పాటు సమీపంలోని అడవుల్లో  పట్టు కోసం మావోయిస్టు పార్టీ ప్రయత్నాలు చేస్తుందని పోలీసులు అనుమానిస్తున్నారు.  దీంతో ఈ ప్రాంతంలో  కూంబింగ్ ను ముమ్మరం చేశారు. ఈ ప్రాంతంలో  మావోయిస్టుల కదలికలు ఉన్న విషయాన్ని గుర్తించిన  పోలీస్ శాఖ  అక్టోబర్ మాసంలో  హెలికాప్టర్లతో ఏరియల్ సర్వే నిర్వహించింది. కాల్పులు జరిగిన ప్రాంతంతో పాటు సమీపంలో  పోలీసులు జల్లెడ పడుతున్నారు. మావోయిస్టుల ఉనికిని గుర్తించడంతో  కేరళ సర్కార్ అలెర్ట్ అయింది. 

click me!