రాఖీ కట్టి వస్తుండగా, అక్కాచెల్లెళ్లపై పది మంది గ్యాంగ్‌రేప్.. నిందితుల్లో బీజేపీ నేత తనయుడు

Siva Kodati |  
Published : Sep 02, 2023, 03:16 PM ISTUpdated : Sep 02, 2023, 03:28 PM IST
రాఖీ కట్టి వస్తుండగా, అక్కాచెల్లెళ్లపై పది మంది గ్యాంగ్‌రేప్.. నిందితుల్లో బీజేపీ నేత తనయుడు

సారాంశం

కాబోయే భర్తతో కలిసి రక్షాబంధన్ వేడుకలు జరుపుకుని ఇంటికి తిరిగి వస్తుండగా ఇద్దరు సోదరీమణులపై పది మంది సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. చత్తీస్‌గఢ్‌లోని రాయపూర్‌లో ఈ ఘటన జరిగింది. 

అన్నాచెల్లెల్లు, అక్కాతమ్ముళ్ల బంధానికి ప్రతీక అయిన పవిత్ర రక్షాబంధన్ రోజున దారుణం జరిగింది. కాబోయే భర్తతో కలిసి రక్షాబంధన్ వేడుకలు జరుపుకుని ఇంటికి తిరిగి వస్తుండగా ఇద్దరు సోదరీమణులపై సామూహిక అత్యాచారం జరిగింది. పది మంది కామాంధులు వారిని మార్గమధ్యంలో అడ్డుకుని ఈ దారుణానికి ఒడిగట్టారు. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముగ్గురు నిందితులు తొలుత వారిని అడ్డగించారు. వీరి వద్ద నుంచి నగదు, మొబైల్ ఫోన్లు దోచుకెళ్లారు. ఆ తర్వాత మరో ఏడుగురు దుండగులు నాలుగు ద్విచక్ర వాహణాలపై ఘటనాస్థలికి చేరుకున్నారు. అనంతరం ఇద్దరు అక్కాచెల్లెళ్లను బలవంతంగా నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి వారిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఇద్దరు బాలికల వెంట వచ్చిన వ్యక్తిని దుండగులు చితకబాదారు. 

Also Read: 85 ఏళ్ల మహిళపై అత్యాచారం, బ్లేడుతో పెదాలు కోసి.. 28 ఏళ్ల వ్యక్తి అరెస్ట్

సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు కారణమైన పదిమందిని అరెస్ట్ చేశారు. వీరిలో స్థానిక బీజేపీ నేత కుమారుడు కూడా వున్నాడు. నిందితులకు గతంలో నేర చరిత్ర వుందని.. ప్రధాన అనుమానితుల్లో ఒకరైన పూనమ్ ఠాకూర్ ఇటీవల ఆగస్టు 2023లో బెయిల్‌పై విడుదలయ్యాడు. పూనమ్ ఠాకూర్ స్థానిక బీజేపీ నేత లక్ష్మీనారాయణ్ సింగ్ కుమారుడు. స్థానికంగా ఈ ఘటన సంచలనం సృష్టిస్తోంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Nitin Nabin : బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మోదీ నమ్మిన బంటు.. ఎవరీ నితిన్ నబిన్?
Indian Railways : ఇండియన్ రైల్వే బంపర్ ఆఫర్.. తక్కువ ఖర్చుతో దేశమంతా తిరిగేయండిలా !