'తప్పు జరిగింది...' : పిటిషన్ దాఖలు చేసిన యాంటిలియా బాంబ్ కేసు నిందితుడు

Published : Feb 18, 2023, 02:56 AM IST
'తప్పు జరిగింది...' : పిటిషన్ దాఖలు చేసిన యాంటిలియా బాంబ్ కేసు నిందితుడు

సారాంశం

యాంటిలియా బాంబ్ కేసులో సస్పెండ్ చేయబడిన పోలీస్ అధికారి సునీల్ మానే క్షమాపణలు కోరుతూ పొరపాటున చేశానని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

యాంటిలియా బాంబు కేసు: దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ ఇంటి ఆంటిలియా వెలుపల బాంబు బెదిరింపు కేసులో మరోసారి పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో సస్పెండ్ అయిన పోలీసు అధికారి సునీల్ మానే క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు సునీల్‌ మానే ప్రత్యేక కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఇప్పటికే ఈ కేసులో మనేని కుట్రదారుగా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) పరిగణించింది.

ఈ క్రమంలో మనే పిటిషన్‌పై తమ వైఖరిని తెలియజేయాలని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)ని కోర్టు శుక్రవారం ఆదేశించింది. మానే ఏప్రిల్ 2021లో అరెస్టు చేయబడ్డాడు. ప్రస్తుతం ఆయన జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు. ఈ క్రమంలో పోలీసు ఆఫీసర్ మనే గురువారం కోర్టులో క్షమాపణలు చెప్పారు. తన చేత్తో ఈ క్షమాపణ రాసి, పశ్చాత్తాపపడే అవకాశం ఇవ్వాలని కోర్టును కోరాడు. ప్రత్యేక NIA న్యాయమూర్తి AM పాటిల్ శుక్రవారం దీనిని రికార్డు చేశారు. ఆ తర్వాత ప్రాసిక్యూషన్ నుండి ప్రతిస్పందనను కోరాడు.

క్షమాపణలో మానే ఏం రాశారు?

వార్తా సంస్థ PTI ప్రకారం.. మానే తన క్షమాపణ పిటిషన్ లో ఇలా వ్రాశాడు, “నా మొత్తం 26 సంవత్సరాల పోలీసు కెరీర్ లో.. నేను ఉత్తమైన, చాలా మంచి అధికారిగా గుర్తించబడ్డాను. అలాగే.. నన్ను అరెస్టు చేసిన నాటివరకు..  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి దాదాపు 280 అవార్డులు అందుకున్నాను. పోలీసు శాఖలోని ఉన్నతాధికారుల నుంచి కూడా గౌరవం లభించింది.  ఒక పోలీసు అధికారిగా దేశ పౌరుల ప్రాణాలను రక్షించడం నా బాధ్యత, కానీ దురదృష్టవశాత్తు, తెలియక నేను కొన్ని తప్పులు చేసాను. ఈ తప్పులకు పశ్చాత్తాపపడేందుకు , బాధితురాలి కుటుంబానికి న్యాయం చేసేందుకు వాస్తవాలను పూర్తిగా, నిజాయితీగా వెల్లడించాలని నిర్ణయించుకున్నాను" అని పేర్కోన్నారు. 

అసలేం జరిగిందంటే..?

థానేకు చెందిన వ్యాపారవేత్త మన్సుఖ్ హిరాన్ హత్యకు కుట్రలో పోలీసు అధికారి మానే హస్తముందని ఎన్ఐఏ పేర్కొంది. అలాగే.. ఫిబ్రవరి 25, 2021 న, ముఖేష్ అంబానీ ఇంటి 'యాంటిలియా' దగ్గర పార్క్ చేసిన పేలుడు పదార్థాలతో నిండిన వాహనం హత్యకు గురి కాబడిన హిరాన్ ది గా గుర్తించారు. ఆ తర్వాత అదే ఏడాది మార్చి 5న థానేలోని డ్రెయిన్‌లో అతని మృతదేహాన్ని అనుమానాస్పద స్థితిలో గుర్తించారు. 

PREV
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం