పక్కింటి వ్యక్తి కత్తితో దాడి.. ఇద్దరి మృతి, నలుగురికి గాయాలు..!

Published : Oct 30, 2021, 09:27 AM ISTUpdated : Oct 30, 2021, 11:52 AM IST
పక్కింటి వ్యక్తి కత్తితో దాడి.. ఇద్దరి మృతి, నలుగురికి గాయాలు..!

సారాంశం

భివాండీలోని గైబీ నగర్ ప్రాంతంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. మహ్మద్ అన్సరుల్ హక్ లుక్మాన్ అన్సారీ(42) ని పోలీసులు అరెస్టు చేసినట్లు శాంతినగర్ పోలీస్ స్టేషన్ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.


పక్కింటి వ్యక్తి ఓ కుటుంబంపై కత్తితో దాడి చేశాడు. ఈ సంఘటన ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.  మరో నలుగురుు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ముగ్గురు చిన్నారులు కూడా ఉండటం గమనార్హం. ఈ సంఘటన మహారాష్ట్ర లోని పవర్ లూమ్ పట్టణంలోని భివాండిలో శుక్రవారం చోటుచేసుకుంది. చిన్న తగాదా.. పెద్ద గొడవ మారి.. చివరకు కత్తితో దాడికి దారి తీసింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే...

Also Read: స్కూల్ బిల్డింగ్‌పై నుంచి రెండో తరగతి పిల్లాడిని తలక్రిందులుగా వేలాడదీసిన హెడ్‌మాస్టర్

భివాండీలోని గైబీ నగర్ ప్రాంతంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. మహ్మద్ అన్సరుల్ హక్ లుక్మాన్ అన్సారీ(42) ని పోలీసులు అరెస్టు చేసినట్లు శాంతినగర్ పోలీస్ స్టేషన్ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.

ఈ కత్తి దాడిలో కమ్రుజ్మా అన్సారీ(42), ఇంతియాజ్ మహ్మద్ జుబేరీ ఖాన్(35)లు ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులు సహా.. నలుగురు  తీవ్రంగా గాయపడ్డారు. ఓ చిన్న విషయంలో వారికి గొడవ జరగడం గమనార్హం.

Also Read: ఆసుపత్రిలోనే డాక్టర్ బాబు రాసలీలలు.. సిబ్బందితో రొమాన్స్ చేస్తున్న వీడియో వైరల్.. చివరకు..

నిందితుడు కమ్రుజ్మా అన్సారీ తో.. ఓ మహిళ.. తో కొంత కాలం క్రితం గొడవ జరిగింది. పరిసరాలు సరిగా లేవంటూ వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దానిని మనసులో పెట్టుకున్న అన్సారీ.. సదరు మహిళ కుటుంబంపై కక్ష పెంచుకున్నాడు. సదరు మహిళ కుటుంబంపై శుక్రవారం ఉదయం కత్తితో దాడి చేయడానికి వెళ్లాడు. దానిని అడ్డుకోవడానికి వెళ్లిన ఇతరులపై కూడా దాడి చేశాడు. ఈ క్రమంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. 
 

PREV
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్