కశ్మీర్‌లో కొనసాగుతున్న ఉగ్రవేట: ఇద్దరు జైషే ముష్కరుల హతం

Siva Kodati |  
Published : Feb 27, 2019, 11:17 AM IST
కశ్మీర్‌లో కొనసాగుతున్న ఉగ్రవేట: ఇద్దరు జైషే ముష్కరుల హతం

సారాంశం

షోపియాన్‌ జిల్లాలో బుధవారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. మీమెందర్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు ఇంటెలిజెన్స్ నుంచి పక్కా సమాచారం ఉండటంతో బీఎస్ఎఫ్, సీఆర్‌పీఎఫ్, కశ్మీర్ పోలీసులు ఓ ఉగ్రవాదులు దాక్కొన్న ఇంటిని చుట్టుముట్టారు. 

పుల్వామా ఘటన తర్వాత ఉగ్రవాదంపై భారత్ పోరును ముమ్మరం చేసింది. దాడి జరిగిన 48 గంటల్లోనే ఉగ్రదాడికి సూత్రధారిగా వ్యవహరించిన అబ్దుల్ రషీద్ ఘాజీ, కమ్రాన్‌లు హతమార్చిన భారత సైన్యం... దక్షిణ కశ్మీర్‌ను జల్లెడ పడుతున్నాయి.

ఈ క్రమంలో షోపియాన్‌ జిల్లాలో బుధవారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. మీమెందర్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు ఇంటెలిజెన్స్ నుంచి పక్కా సమాచారం ఉండటంతో బీఎస్ఎఫ్, సీఆర్‌పీఎఫ్, కశ్మీర్ పోలీసులు ఓ ఉగ్రవాదులు దాక్కొన్న ఇంటిని చుట్టుముట్టారు.

ముష్కరులు కాల్పులు జరపడంతో... భారత సైన్యం ఎదురుకాల్పులు జరిపింది. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారని, వారిని జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన వారిగా సైన్యం తెలిపింది.     

PREV
click me!

Recommended Stories

నిర్మాత తిని ప‌డేసిన బొక్క‌లు తిన్న రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఎందుక‌ని అడ‌గ్గా, ఊహ‌కంద‌ని ఆన్స‌ర్‌
Viral Video: ఏసీలో నుంచి వింత శ‌బ్ధాలు.. ఏంటా అని చూడ‌గా గుండె గుబేల్‌, వైర‌ల్ వీడియో