మెట్రోరైలు కిందపడి ఏఎస్సై ఆత్మహత్య....

By Arun Kumar PFirst Published Apr 4, 2019, 4:33 PM IST
Highlights

ప్రయాణికుల కోసం అత్యాధునిక భద్రతా చర్యలు తీసుకున్నప్పటికి మెట్రో రైల్లు కూడా సామాన్య రైల్ల మాదిరిగానే ఆత్మహత్యా స్పాట్ లుగా మారిపోయాయి. ఇప్పటికే డిల్లీ మెట్రో రైలు కింద పడి అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా అలా మెట్రో రైలు కింద పడి ఓ పోలీస్ అధికారి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ దారుణం జహంగీర్ పూర్ మెట్రో స్టేషన్లో చోటుచేసుకుంది.

దేశ రాజధాని డిల్లీలో అజయ్ కుమార్ అనే వ్యక్తి అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే అతడు ఇవాళ మద్యాహ్నం జహంగీర్‌పురి మెట్రో స్టేషన్ లోకి ప్రవేశించాడు. అక్కడ ప్రయానికులందరు చూస్తుండగానే వేగంగా మెట్రో రైలు వస్తుండగా పట్టాలపైకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రైలు వేగానికి అతడి శరీరం ముక్కలుముక్కలుగా మారిపోయింది. 

ఈ ఆత్మహత్యపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని ఏఎస్సై మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ  ఆత్మహత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

డిల్లీలో మెట్రో స్టేషన్లలో ఆత్మహత్యలు జరగడం ఇదేమీ కొత్తకాదు. కేవలం నెల రోజుల వ్యవధిలోని ఇలా నాలుగు ఆత్మహత్యలు జరిగాయి. మెట్రో స్టేషన్లలోకి ప్రవేశిస్తున్న ప్రయాణికులు సరిగ్గా రైలు వచ్చే సమయానికి పట్టాలపైకి దూకి ఆత్మహత్య చేసుకుంటున్నారు. సరైన భద్రతాచర్యలు తీసుకోకపోవడం వల్లే సామాన్య రైలు పట్టాల మాదిరిగా మెట్రో స్టేషన్లు కూడా సౌసైడ్ స్పాట్ లుగా మారినట్లు ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 
 
click me!