రెసిడెన్షియల్ బిల్డింగ్ లో అగ్ని ప్రమాదం.. ఇద్దరి మృతి

Published : Nov 14, 2018, 10:18 AM IST
రెసిడెన్షియల్ బిల్డింగ్ లో అగ్ని ప్రమాదం.. ఇద్దరి మృతి

సారాంశం

ఈ ప్రమాదంలో ఇద్దరు మంటల్లో సజీవ దహనం కాగా.. మరో నలుగురు క్షేమంగా ప్రాణాలతో బయటపడ్డారు.

రెసిడెన్షియల్ బిల్డింగ్ లో అగ్ని ప్రమాదం సంభవించి.. ఇద్దరు ఆ అగ్నికి ఆహుతైన సంఘటన ముంబయి నగరంలోని అంథేరీలో చోటుచేసుకుంది. మంగళవారం సాయంత్రం ఈ ప్రమాదం చోటుచేసుకుందని బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తెలిపారు.

అది 21 అంతస్థుల బిల్డింగ్ కాగా.. అకస్మాత్తుగా 5, 6వ అంతస్థుల్లో అగ్ని ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. ఈ ప్రమాదంలో ఇద్దరు మంటల్లో సజీవ దహనం కాగా.. మరో నలుగురు క్షేమంగా ప్రాణాలతో బయటపడ్డారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

BRICS Summit : బ్రిక్స్ అతిథులకు వెండి పాత్రల్లో భోజనం... వీటిని చూస్తే వావ్ అనాల్సిందే!
మోదీని చూడగానే పుతిన్ ఇచ్చే రెస్పెక్ట్ చూడండి దట్ఈస్ మోదీ | PM Modi-Putin Meeting in Delhi