జమ్మూ కాశ్మీర్ లోని ఆర్నియా, ఆర్ఎస్ పురాలో పాకిస్థాన్ కాల్పులు.. ఇద్దరు జవాన్లు, నలుగురు పౌరులకు గాయాలు

By SumaBala BukkaFirst Published Oct 27, 2023, 8:55 AM IST
Highlights

జమ్మూ కాశ్మీర్‌లోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాకిస్థాన్ జరిపిన అనూహ్య కాల్పుల్లో ఇద్దరు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సిబ్బంది, నలుగురు పౌరులు గాయపడ్డారు.

జమ్మూ కాశ్మీర్‌ : జమ్మూ కాశ్మీర్‌లో పాకిస్తాన్ కాల్పులకు తెగబడింది. ఆర్నియా, సుచేత్‌ఘర్ సెక్టార్‌లలోని అంతర్జాతీయ సరిహద్దు (ఐబి) వెంబడి ఐదు భారత పోస్టులపై గురువారం రాత్రి పాకిస్తాన్ రేంజర్లు అకారణంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు సరిహద్దు భద్రతా దళ సిబ్బంది, ఒక పౌరుడు గాయపడ్డారు.

ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు తెలిపారు. అర్నియా సెక్టార్‌లో రాత్రి 8 గంటల ప్రాంతంలో పాక్ సైనికుల కాల్పులు ప్రారంభమయ్యాయని, "అనూహ్యంగా కాల్పులు" జరిపినందుకు తగిన ప్రతీకారం తీర్చుకున్నామని ఆయన అన్నారు. నాలుగు నుంచి ఐదు పోస్టులు ఇరువైపులా కాల్పుల్లో పాల్గొన్నాయని బీఎస్ఎఫ్ అధికారి ఒకరు వార్తా సంస్థ పీటీఐకి తెలిపారు.

ఢిల్లీ మెట్రో స్టేషన్ సమీపంలో మహిళ మృతదేహం.. ముఖం ఛిద్రం చేసి..

గాయపడిన జవాన్‌ను ప్రత్యేక చికిత్స కోసం జమ్మూలోని జిఎంసి ఆసుపత్రికి తరలించినట్లు అధికారి తెలిపారు. బీఎస్‌ఎఫ్‌ ప్రతీకార చర్యలో పాక్‌ పోస్టులకు ఏమైనా నష్టం జరిగిందా అనే విషయం శుక్రవారం ఉదయానికి తెలుస్తుందని చెప్పారు. పాకిస్థానీ రేంజర్లు పౌర ప్రాంతాలలో మోర్టార్ షెల్స్‌ను కూడా ప్రయోగించారని, దీంతో సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయని అధికార వర్గాలు పిటిఐకి తెలిపాయి.

కాల్పులు జరిగిన కొన్ని ప్రాంతాలలో ఐబితో పాటు ఆర్నియా, సుచ్త్‌గఢ్, సియా, జబోవాల్, ట్రెవా ప్రాంతాలు ఉన్నాయని వారు తెలిపారు. అర్నియా, జబోవాల్‌లోని ప్రజలు, ముఖ్యంగా వలస కార్మికులు తమ ఇళ్లను వదిలి పారిపోతూ కనిపించారు.

click me!