ఒకే ఇంట్లో తొమ్మిది మృతదేహాలు.. అవి ఆత్మహత్యలు కాదు హత్యలు.. వెలుగులోకి షాకింగ్ విషయాలు..

By SumaBala BukkaFirst Published Jun 29, 2022, 2:06 PM IST
Highlights

మహారాష్ట్రలో కలకలం రేపిన ఒకే ఇంట్లో తొమ్మిదిమంది ఆత్మహత్య కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వారిది ఆత్మహత్య కాదని.. గుప్తనిధుల కోసం విషం ఇచ్చి హత్య చేశారని తేలింది. 

ముంబయి :  మహారాష్ట్రలోని sangili జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆ కేసుకు సంబంధించిన దర్యాప్తులో  షాకింగ్ విషయాలు  వెలుగులోకి వచ్చాయి. పోలీసుల విచారణలో ఇది ఆత్మహత్య కాదని హత్యగా గుర్తించారు.

ఆత్మహత్య కాదు హత్య…
సాంగ్లీ జిల్లాలోని మైసల్​ గ్రామంలో ఇద్దరు అన్నదమ్ములు తమ కుటుంబాలతో కలిసి జీవిస్తున్నారు. వారి కుటుంబాల్లో మొత్తం తొమ్మిదిమంది ఉండేవారు. ఈనెల 20న కుటుంబంలోని 9 మంది ఆత్మహత్య చేసుకున్నారని సమాచారం రావడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. అయితే పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో మొదటగా అన్నదమ్ములకు అప్పులు ఎక్కువగా ఉండటంతో.. వాటిని తీర్చడం కష్టంగా భావించి వేరే దారిలేక ఆత్మహత్యకు పాల్పడ్డారని  తేలింది. 

కానీ ఈ వ్యవహారంపై పోలీసులకు ఎక్కడో అనుమానం రావడంతో ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే షాకింగ్ విషయాలు వెలువడ్డాయి. కుటుంబ సభ్యులది ఆత్మహత్య కాదని విషం ఇచ్చి వారిని చంపేశారని గుర్తించారు. గుప్తనిధుల కోసం ధీరజ్ చంద్రకాంత్, అబ్బాస్ మహమ్మద్ అలీ  అనే ఇద్దరు మాంత్రికులు ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేశారు. అయితే ఈ కేసుకు సంబంధించి మరేదైనా కోణం కూడా దాగుందా? అని పోలీసులు అనుమానిస్తున్నారు. 

ఒకే ఇంట్లో ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మృతదేహాలు.. పోలీసులు ఏం చెబుతున్నారంటే?

ఇదిలా ఉండగా జూన్ 20న మహారాష్ట్రలో ఈ షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. సాంగ్లీ జిల్లాలో ఓ ఇంట్లో ఏకంగా 9  మృతదేహాలు కనిపించాయి. చనిపోయిన వారంతా ఒకే కుటుంబానికి చెందినవారు. దీంతో ఉన్నట్టుండి రాత్రికి రాత్రే ఆ యిల్లు స్మశానాన్ని తలపించింది.  తెల్లారేసరికి పరిస్థితులు  మొత్తం తలకిందులుగా కనిపించడంతో స్థానికులు ఆందోళన చెందారు. ఆ ఊరు ఊరంతా విషాద వాతావరణం నెలకొంది. ఈ ఘటన సాంగ్లి జిల్లాలోని మైసాల్ టౌన్ లో చోటు చేసుకుంది. 

సాంగ్లీ జిల్లాలోని మైసల్​ టౌన్ లో మాణిక్, పోపట్ ఎల్లప్ప వాన్ మోర్  అన్నదమ్ములు.  వీరిద్దరూ కలిసే ఉండేవాళ్ళు. మాణిక్ పెద్దోడు కాగా, పోపట్ ఎల్లప్ప వాన్ మోర్ చిన్నవాడు. సోదరులందరికీ వివాహాలు అయ్యాయి. ఆ సోదరుల కుటుంబాలకు కూడా కలిసి ఉంటుంది. అయితే ఈ రెండు కుటుంబాల సభ్యులు ఘటన రోజు ఆ ఇంట్లో విగతజీవులుగా కనిపించారు.  ఇందులో పెద్దవాడైన మాణిక్  వెటర్నరీ డాక్టర్ గా పని చేసేవాడు. ఈ కుటుంబం ప్రతిరోజు ఉదయం ఊర్లో నుంచి పాలు తెచ్చుకునేదని స్థానికులు చెబుతున్నారు. అయితే ఆ రోజు ఉదయం పాలు అమ్మేవారి దగ్గరికి ఈ కుటుంబం నుంచి ఎవరు వెళ్లలేదు. దీంతో ఆ పాలు అమ్మేవారి నుంచి ఓ అమ్మాయి ఇంటికి వచ్చి చూడగా ఇంట్లో 9 మంది మృతదేహాలు కనిపించాయి. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. 
 

click me!