కరోనా వైరస్ : దేశంలో పెరుగుతున్న పరీక్షలు, కలవరపెడుతున్న మరణాలు..

Published : May 22, 2021, 11:40 AM IST
కరోనా వైరస్ : దేశంలో పెరుగుతున్న పరీక్షలు, కలవరపెడుతున్న మరణాలు..

సారాంశం

దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. మరో రోజు నాలుగు వేలకు పైనే మరణాలు నమోదయ్యాయి. రోజువారి కేసులు మాత్రం కొద్ది మేర తగ్గాయని శనివారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 

దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. మరో రోజు నాలుగు వేలకు పైనే మరణాలు నమోదయ్యాయి. రోజువారి కేసులు మాత్రం కొద్ది మేర తగ్గాయని శనివారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 

శుక్రవారం 20,66,285 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 2,57,299 మందికి వైరస్ పాజిటివ్ గా తేలింది. గత కొద్ది రోజులుగా కొత్త కేసుల్లో స్వల్ప హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి.

అలాగే గత నాలుగు రోజులుగా నిత్యం 20 లక్షలకు పైనే నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నప్పటికీ... మూడు లక్షలకు దిగువనే కేసులు వెలుగు చూస్తున్నాయి.

అలాగే 24 గంటల వ్యవధిలో 4,194 మంది మృతిఒడికి చేరుకున్నారు. మరోసారి వరుసగా రెండో రోజు కరోనా మరణాలు నాలుగు వేలకు పై బడ్డాయి. అత్యధికంగా మహారాష్ట్ర లో 1,263, తమిళనాడులో 467 మరణాలు సంభవించాయి.

ఇప్పటివరకు కరోనా సోకిన వారి సంఖ్య 2,62, 89,290 కి చేరింది. గత సంవత్సర కాలంలో మహమ్మారి 2,95,525 మంది ప్రాణాలు తీసింది. ఇక క్రియాశీల కేసులు 30 లక్షలకు దిగువకు చేరాయి. ప్రస్తుతం 29,23,400 మంది కోవిడ్ తో బాధపడుతున్నారు. నిన్న ఒక్కరోజే 3,57,630 మంది కోలుకున్నారు.

వరుసగా తొమ్మిదో రోజు మొత్తం కొత్త కేసులు కంటే రికవరీ లో ఎక్కువగా నమోదయ్యాయి. మొత్తం రికవరీలు 2.3 కోట్ల మార్కును దాటాయి. క్రియాశీల, రికవరీ రేట్లు వరుసగా 11.12 శాతం, 87.76 శాతంగా ఉన్నాయి. మరోవైపు నిన్న 14,58,895 మందికి టీకాలు అందాయి. 
 

PREV
click me!

Recommended Stories

వినాశకాలే విపరీత బుద్ధి..అయోధ్యలో రాములోరి కళ్లెదుటే | Ayodhya Ram Mandir Donation Theft?
Indian Railways: మరీ ఇంత కక్కుర్తా? ట్రైన్‍లో దుప్పట్లు, ఫేస్ టవల్స్ ఎత్తుకెళ్లిన ప్యాసింజర్లు..రైల్వేకు రూ.కోట్ల నష్టం