కరోనా వ్యాక్సిన్ తీసుకున్న 120ఏళ్ల బామ్మ..ఆర్మీ కమాండర్ సలాం..!

By telugu news teamFirst Published May 22, 2021, 9:27 AM IST
Highlights

ఆమె ధైర్యంగా ముందుకు వచ్చి కరోనా వ్యాక్సిన్ తీసుకోవడం పై ఆర్మీ కమాండర్ లెఫ్ట్ నెంట్ జనరల్ వై కే జోషి స్పందించారు. ఆమెకు తన గౌరవ వందనాన్ని తెలియజేశారు.

కరోనా మహమ్మారి దేశంలో ఎంతలా విజృంభిస్తుందో అందరికీ తెలిసిందే. ఈ మహమ్మారి కారణంగా వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇంత మంది ప్రాణాలు పోతున్నా.. చాలా మంది వ్యాక్సిన్ వేయించుకోవడానికి ముందుకు రావడం లేదు. అలాంటివారికి ఓ 120ఏళ్ల బామ్మ ఆదర్శంగా నిలిచారు.

జమ్మూకశ్మీర్  రాష్ట్రం ఉదమ్ పూర్ జిల్లాలో ని ఓ మారుమూల గ్రామానికి చెందిన 120ఏళ్ల బామ్మ.. కరోనా తొలి డోస్ వ్యాక్సిన్ తీసుకున్నారు. కాగా.. ఆమె ధైర్యంగా ముందుకు వచ్చి కరోనా వ్యాక్సిన్ తీసుకోవడం పై ఆర్మీ కమాండర్ లెఫ్ట్ నెంట్ జనరల్ వై కే జోషి స్పందించారు. ఆమెకు తన గౌరవ వందనాన్ని తెలియజేశారు.

120ఏళ్ల ఢోలీ దేవి మే 17వ తేదీన తన వ్యాక్సిన్ తొలి డోస్ తీసుకున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా ఆమెకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాలేదని అక్కడి వైద్యులు తెలిపారు. కాగా.. ఆమె వ్యాక్సిన్ తీసుకొని.. గ్రామం మొత్తానికి ఆదర్శంగా నిలిచారని.. ఆర్మీ కమాండర్ పేర్కొన్నారు.

తమ బామ్మకు వ్యాక్సిన్ తర్వాత ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాలేదని.. ఆరోగ్యంగా ఉందని ఆమె మనవడు చమన్ కూడా మీడియాకు తెలియజేశాడు. ప్రస్తుతం స్థానికంగా ఆమెను అందరూ హీరో అంటూ పొగడుతుండటం విశేషం. 

click me!