1984 సిక్కు అల్లర్ల కేసు: కాంగ్రెస్‌ సీనియర్ నేత గులాటీకి జీవిత ఖైదు

By sivanagaprasad kodatiFirst Published Dec 17, 2018, 11:04 AM IST
Highlights

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన 1984 ఢిల్లీ సిక్కు అల్లర్ల కేసులో ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో కీలక ప్రధాని నిందితుడిగా ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేత సజ్జన్ కుమార్ గులాటీకి జీవితఖైదు విధిస్తూ తీర్పు చెప్పింది.

తీర్పు సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ ‘‘ సవాళ్లు ఉన్నప్పటీకి న్యాయానిదే అంతిమ విజయమని, న్యాయం ఎప్పటికైనా గెలుస్తుందని బాధితులకు భరోసా ఇవ్వడం అత్యవసరమని వ్యాఖ్యానించారు. వివిధ నేరాల్లో ఆరోపణలు ఎదుర్కోంటున్న వారు రాజకీయ పోషణను అనుభవిస్తున్నారని.. అలాగే ఒత్తిళ్లకు తలొగ్గి చివరి వరకు పోరాడి, ప్రత్యక్ష సాక్షిగా వాంగ్మూలం ఇచ్చిన జగదీష్ కౌర్‌ను ప్రశంసించారు.

అలాగే డిసెంబర్ 31 లోపు సజ్జన్ కుమార్ పోలీసులకు లొంగిపోవాలని ఆదేశించారు. 1984లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఆమె అంగరక్షకులైన సిక్కు గార్డుల చేతిలో దారుణ హత్యకు గురయ్యారు. ఇందిర మరణాన్ని జీర్ణించుకోలేని కాంగ్రెస్ కార్యకర్తలు ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న సిక్కుల ఇళ్లపై దాడికి దిగారు. ఈ అల్లర్లలో వేలాది మంది మరణించగా, ఎంతమంది సిక్కు మహిళలు అత్యాచారాలకు గురయ్యారు. 

click me!