ప్రతిపక్ష నేతలను మోడీ టార్గెట్ చేశారు: చంద్రబాబు ఫైర్

Published : Dec 16, 2018, 07:47 PM IST
ప్రతిపక్ష నేతలను మోడీ టార్గెట్ చేశారు: చంద్రబాబు ఫైర్

సారాంశం

దేశం చాలా ప్రమాదంలో ఉఅందని, వచ్చే ఆరు నెలలు అత్యంత కీలకమైనవని చంద్రబాబు అన్నారు. ఈవిఎంలను ట్యాంపరింగ్ చేస్తున్నారని, ప్రతిపక్షాల నేతలను ప్రధాని నరేంద్ర మోడీ టార్గెట్ చేసుకుంటున్నారని ఆయన విమర్శించారు.

చెన్నై: ఎన్డీఎ కేంద్ర ప్రభుత్వంపై, బిజెపిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. కరుణానిధి విగ్రహావిష్కరణ సభలో ఆయన ఆదివారం ప్రసంగించారు. డిఎంకెను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని, బిజెపి పతనానికి డిఎంకె విజయంతో నాంది పలకాలని ఆయన పిలుపునిచ్చారు. 

దేశం చాలా ప్రమాదంలో ఉఅందని, వచ్చే ఆరు నెలలు అత్యంత కీలకమైనవని చంద్రబాబు అన్నారు. ఈవిఎంలను ట్యాంపరింగ్ చేస్తున్నారని, ప్రతిపక్షాల నేతలను ప్రధాని నరేంద్ర మోడీ టార్గెట్ చేసుకుంటున్నారని ఆయన విమర్శించారు. కొన్ని రాష్ట్రాల్లో బిజెపి దొడ్డి దారిన అధికారంలోకి వచ్చిందని ఆయన తప్పు పట్టారు. 

 

బ్యాంకింగ్ వ్యవస్థలో అవినీతి చోటు చేసుకుందని ఆయన విమర్శించారు. రిజర్వ్ బ్యాంక్ పరిణామాలను కూడా ఆయన ప్రస్తావించారు.  

 

కరుణానిధిని రెండు సార్లు కలిశానని, కరుణానిధి చాలా సాధారణంగా కనిపించారని, అది చాలా గొప్పగా అనిపించిందని ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. కరుణానిధి యువ నాయకులకు మార్గదర్శి అని చెప్పారు. తమిళనాడు అభివృద్ధికి కరుణానిధి చాలా చేశారని చెప్పారు. 

కరుణానిధి తమిళ ప్రజల గొప్పతనం గురించి చాలా చెప్పేవారని అన్నారు. భాషను, సంస్కృతిని కించపరిచే బిజెపిని వచ్చే ఎన్నికల్లో ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు. కరుణానిధి తమిళ ప్రజల మేలు కోసమే పనిచేశారని ఆయన అన్ారు. 

కరుణానిధి విగ్రహావిష్కరణ సభలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, చంద్రబాబు, పినరయ్ రవి, రజనీకాంత్  తదితరులు పాల్గొన్నారు. 

 

ఢిల్లీలో కొత్త ప్రధానిని నిలబెట్టాలని డిఎంకె నేత స్టాలిన్ అన్నారు. ప్రధాని పదవికి రాహుల్ గాంధీ పేరును తాను ప్రతిపాదిస్తున్నట్లు తెలిపారు. ఐదేళ్ల మోడీ పాలనలో దేశం 15 ఏళ్లు వెనక్కి వెళ్లిందని ఆయన విమర్శఇంచారు. మరో ఐదేళ్లు అవకాశం ఇస్తే 50 ఏళ్లు వెనక్కి తీసుకుని వెళ్తారని ఆయన అన్నారు. 

 

PREV
click me!

Recommended Stories

Nitin Nabin : బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మోదీ నమ్మిన బంటు.. ఎవరీ నితిన్ నబిన్?
Indian Railways : ఇండియన్ రైల్వే బంపర్ ఆఫర్.. తక్కువ ఖర్చుతో దేశమంతా తిరిగేయండిలా !