వ్యక్తి కడుపులో 187 నాణేలు.. షాక్ లో డాక్టర్లు..ఇంతకీ ఎలా వెళ్లాయంటే...

By SumaBala BukkaFirst Published Nov 30, 2022, 2:05 PM IST
Highlights

సైకియాట్రిక్ డిజార్డర్‌తో బాధపడుతున్న అతను గత 2-3 నెలలుగా నాణేలు మింగుతున్నాడని సర్జరీ చేసిన వైద్యుల్లో ఒకరైన డాక్టర్ ఈశ్వర్ కలబుర్గి తెలిపారు.

కర్ణాటక : బాగల్ కోట్ లో ఓ విచిత్ర ఘటన వెలుగు చూసింది. ఓ వ్యక్తి కడుపునొప్పితో.. వాంతులతో బాధపడుతూ ఆస్పత్రికి వచ్చాడు. అతడిని పరీక్షించిన వైద్యులు ఆపరేషన్ చేసి అతని కడుపులోనుంచి 187 నాణాలను బైటికి తీశారు. కర్ణాటకలోని బాగల్‌కోట్‌లోని హనగల్ శ్రీ కుమారేశ్వర్ హాస్పిటల్, రీసెర్చ్ సెంటర్‌లో ఈ ఘటన వెలుగు చూసింది. కడుపులో అసౌకర్యంతో చేరిన ఓ రోగి కడుపులో నాణాలు ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

దీనిమీద డాక్టర్లు మాట్లాడుతూ.. "అతను మానసిక సమస్యలతో బాధపడుతున్నాడు. దీనివల్లే గత 2-3 నెలలుగా నాణేలు మింగుతున్నాడు. ఈ కారణంగానే అతను వాంతులు, కడుపులో అసౌకర్యంతో బాధపడుతూ ఆసుపత్రికి వచ్చాడు" అని శస్త్రచికిత్స చేసిన వైద్యులలో ఒకరైన డాక్టర్ ఈశ్వర్ కలబుర్గి చెప్పారు. ఉన్నట్టుండి కడుపునొప్పి రావడంతో అతడిని బంధువులు హంగల్‌ శ్రీ కుమారేశ్వర్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ మెడికోలు అతడికి ఎక్స్-రే తీశారు. ఎండోస్కోపీ చేశారు. వీటి ద్వారానే రోగి కడుపులో నాణాలు ఉన్నట్లు తేలింది. దీంతో అతడికి ఆపరేషన్ చేసి మొత్తం 187 నాణేలను బైటికి తీశారు. వీటిలో 56 రూ. 5 నాణేలు, 51 రూ. 2 నాణేలు, 80 రూ.1 నాణాలు ఉన్నాయి.

అస్సాం యూనివర్సిటీ ర్యాగింగ్ కేసు.. ఆరోవ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు...

ద్యామప్ప హరిజన్ అనే ఆ వ్యక్తి రెండు, మూడు నెలల వ్యవధిలో మొత్తం 1.5 కిలోల బరువున్న వివిధ రకాల నాణేలను మింగినట్లు వైద్యులు తెలిపారు. ద్యామప్ప హరిజన్‌ రాయచూర్ జిల్లా లింగ్సుగూర్ పట్టణంలో నివసిస్తున్నాడు. రోగి స్కిజోఫ్రెనియాతో బాధపడుతున్నాడని, మానసిక వ్యాధితో బాధపడుతున్నారని చెప్పారు.

"కడుపు విపరీతంగా వ్యాకోచించింది. చాలా నాణేలు కడుపులోని  వివిధ ప్రదేశాలలో ఇరుక్కుపోయాయి. రెండు గంటల శస్త్రచికిత్స తర్వాత, నాణేలన్నింటిని మేం తీయగలిగాం. ఆపరేషన్ తర్వాత, అతను వాటర్ డెఫీషియన్సీ లాంటి సమస్యలతో బాధపడకుండా చికిత్స చేశాం. రోగి స్థిరంగా ఉన్నాడు. ఇప్పుడు మాట్లాడుతున్నాడు" అని డాక్టర్ కలబుర్గి అన్నారు.

అతను స్కిజోఫ్రెనియాతో బాధపడుతున్నాడు. ఈ స్థితిలో, రోగులు ఏమి చేస్తున్నారో వారికి తెలియదు. ఇలాంటి సంఘటనలు చాలా అరుదుగా జరుగుతాయి. నా 40 ఏళ్ల సర్వీస్‌లో నాకు ఇదే తొలికేసు’’ అని డాక్టర్ కలబుర్గి తెలిపారు.

click me!