బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడుతూ కనిపించిందని...

Published : Mar 15, 2021, 07:59 AM IST
బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడుతూ కనిపించిందని...

సారాంశం

ఓ యువతి పట్ల గ్రామస్థులు దారుణంగా ప్రవర్తించారు. అబ్బాయితో మాట్లాడతావా అంటూ గ్రామస్థులే ఆమెపై దాడి చేయడం గమనార్హం. 


ఈ కాలంలో బాయ్ ఫ్రెండ్స్ లేని అమ్మాయిలు చాలా అరుదు అనే చెప్పాలి. బాయ్ ఫ్రెండ్స్ తో మాట్లాడటం.. షికార్లు చేయడం కూడా సర్వ సాధారణమైపోయింది. ఇలాంటి రోజుల్లో.. కేవలం బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడుతూ కనిపించిందనే కారణంతో ఓ యువతి పట్ల గ్రామస్థులు దారుణంగా ప్రవర్తించారు. అబ్బాయితో మాట్లాడతావా అంటూ గ్రామస్థులే ఆమెపై దాడి చేయడం గమనార్హం. ఈ సంఘటన రాజస్థాన్ లోని భరత్ పూర్ లో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

భరత్ నగర్ కి చెందిన ఓ యువతి తన ప్రియుడితో కలిసి ఒక షాపు ముందు కూర్చొని ముచ్చట్లు చెప్తోంది. దీన్ని చూసిన స్థానికులు ఆగ్రహంతో ఆమెను చితకబాదారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ ఘటన వారం రోజుల క్రితం జరిగినట్లు తెలుస్తోంది. ఈ వీడియోను పోలీసులు పరిశీలించారని తెలుస్తోంది.  ఇప్పటి వరకు వారిపై ఎలాంటి కేసు నమోదు కాలేదని తెలుస్తోంది. మాట్లాడినందుదకే ఇంత దారుణంగా కొట్టడం కరెక్ట్ కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Indigo కు షాక్: 10 శాతం విమానాలు రద్దు.. రంగంలోకి ప్రత్యేక టీమ్ తో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
ఏఐ ఉద్యోగాలను తగ్గించదు.. పెంచుతుంది : యోగి ఆసక్తికర కామెంట్స్