డబ్బుల కోసం తమ్ముడిని హతమార్చిన 16యేళ్ల బాలుడు.. అరెస్ట్..

Published : Aug 04, 2022, 07:46 AM IST
డబ్బుల కోసం తమ్ముడిని హతమార్చిన 16యేళ్ల బాలుడు.. అరెస్ట్..

సారాంశం

డబ్బుల కోసం ఏర్పడిన వివాదంలో 16యేళ్ల బాలుడు తన తమ్ముడిని దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన చత్తీస్ ఘడ్ లోని రాయ్ పూర్ లో చోటు చేసుకుంది.   

రాయ్‌పూర్ : రాయ్‌పూర్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పదే పదే డబ్బులు అడుగుతున్నాడని, ఇష్టం వచ్చినట్లు డబ్బులు ఖర్చు పెడుతున్నాడని తన తమ్ముడిని చంపేశాడో ఓ 16యేళ్ల బాలుడు. ఈ ఘటన మంగళ, బుధవారాల మధ్యరాత్రి చోటు చేసుకుంది. డబ్బుకు సంబంధించిన వివాదంలో 16 ఏళ్ల బాలుడు తన తమ్ముడిని హత్య చేసినట్లు పోలీసులు బుధవారం తెలిపారు.
నిమోరా గ్రామంలో ఈ సంఘటన జరిగిందని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.

చనిపోయిన వ్యక్తి డబ్బు విషయంలో అజాగ్రత్తగా ఉంటాడని, ఎక్కువ ఖర్చు చేస్తాడని.. తన సోదరుడిని డబ్బు కోసం తరచూ అడిగేవాడని ప్రాథమిక విచారణలో నిందితుడు ఆరోపించాడు. ఈ విషయమై మంగళవారం అన్నదమ్ముల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో విసిగిపోయిన బాలుడు రాత్రిపూట తన తమ్ముడు నిద్రిస్తుండగా పికాక్స్‌తో కొట్టాడని దీంతో ఆ బాలుడు చనిపోయాడని పోలీసుల దర్యాప్తులో తేలింది, అతడిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్లు అధికారి తెలిపారు.

Shahjahanpur: 28 ఏళ్ల తర్వాత అత్యాచార బాధితురాలికి న్యాయం.. న్యాయస్థాన పోరాటంలో అండ‌గా నిలిచిన కొడుకు

PREV
click me!

Recommended Stories

Census 2027 : వచ్చేస్తున్న డిజిటల్ జనాభా లెక్కలు.. పేపర్ లేదు, పెన్ను లేదు.. అంతా యాప్ ద్వారానే !
IndiGo : ఇండిగో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సీఈఓ పీటర్‌ ఎల్బర్స్‌ క్షమాపణలు.. బిగ్ అప్డేట్ !