దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ (omicron) కలవరపాటుకు గురిచేస్తున్న వేళ ఓవైపు కరోనా కేసులు (coronavirus) సైతం భారీగా పెరుగుతున్నాయి. ప్రత్యేకించి సెకండ్ వేవ్‌లో అల్లాడిపోయిన మహారాష్ట్రలో (maharashtra) కోవిడ్ (covid 19) పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి.
దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ (omicron) కలవరపాటుకు గురిచేస్తున్న వేళ ఓవైపు కరోనా కేసులు (coronavirus) సైతం భారీగా పెరుగుతున్నాయి. ప్రత్యేకించి సెకండ్ వేవ్‌లో అల్లాడిపోయిన మహారాష్ట్రలో (maharashtra) కోవిడ్ (covid 19) పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా నవీ ముంబయిలోని (navi mumbai) ఓ పాఠశాలలో 16 మంది విద్యార్థులు వైరస్ బారిన పడటం కలకలం రేపుతోంది. దీంతో మహమ్మారి సోకిన విద్యార్థులందరినీ ఐసోలేషన్ సెంటర్‌కు తరలించి చికిత్స అందిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.
వైరస్ బారినపడిన విద్యార్థులంతా 8 నుంచి 11 తరగతులు చదువుతున్నవారేనని నవీ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (brihanmumbai mahanagarpalika) అధికారులు పేర్కొన్నారు. ఘన్సోలీలోని గోతివలిలో ఉన్న షెట్కారి శిక్షణ్ సంస్థ పాఠశాలలో కొవిడ్ బారినపడిన 11వ తరగతి విద్యార్థి తండ్రి ఈ నెల 9న ఖతార్ నుంచి వచ్చినట్టు అధికారులు గుర్తించారు. అయితే, అతడికి నెగెటివ్ వచ్చినప్పటికీ కుటుంబ సభ్యులకు పరీక్షలు నిర్వహించగా.. విద్యార్థిలో మాత్రం వైరస్ నిర్ధారణ అయినట్లు పేర్కొన్నారు.
undefined
ALso Read:ఫైజర్ టీకా మూడు డోసులు తీసుకున్నా.. ఆ వ్యక్తికి ఒమిక్రాన్ పాజిటివ్
దీంతో అలర్ట్ అయిన అధికార యంత్రాంగం పాఠశాలలోని విద్యార్థులందరికీ పరీక్షలు నిర్వహిస్తోంది. ఇప్పటికే కొందరు విద్యార్థులకు టెస్టులు చేసిన అధికారులు.. శనివారం మరో 600 మందికి పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రస్తుతం మహారాష్ట్రలో 10,582 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. అలాగే, ఒమిక్రాన్ కేసులు సైతం మహారాష్ట్రలోనే ఎక్కువగా వున్నాయి. ఇప్పటివరకు అక్కడ 40 కొత్త వేరియంట్ కేసులు వెలుగుచూశాయి.