తిక్క కుదిరింది: రాంగ్‌కాల్‌తో వల వేద్దామనుకుంటే..బామ్మతో పెళ్లి

sivanagaprasad kodati |  
Published : Oct 21, 2018, 12:52 PM IST
తిక్క కుదిరింది: రాంగ్‌కాల్‌తో వల వేద్దామనుకుంటే..బామ్మతో పెళ్లి

సారాంశం

క అమ్మాయిని బుట్టలోకి లాగుదామనుకున్న ఓ బాలుడు అడ్డంగా బుక్కై చివరికి బామ్మను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. అసోంలోని గోల్‌పురా జిల్లాకు చెందిన ఓ పదిహేనేళ్ల బాలుడు స్థానికంగా ఉన్న ఇటుకల బట్టీలో పనిచేస్తుంటాడు. 

ఒక అమ్మాయిని బుట్టలోకి లాగుదామనుకున్న ఓ బాలుడు అడ్డంగా బుక్కై చివరికి బామ్మను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. అసోంలోని గోల్‌పురా జిల్లాకు చెందిన ఓ పదిహేనేళ్ల బాలుడు స్థానికంగా ఉన్న ఇటుకల బట్టీలో పనిచేస్తుంటాడు.

నెల రోజుల క్రితం సరదాగా ఓ రాంగ్‌కాల్ చేశాడు.. అటుపక్క నుంచి మధురమైన స్వరంతో అమ్మాయి గొంతు వినిపించడంతో ప్లాన్ వర్కవుట్ అయ్యింది.. ఎవరో అమ్మాయి పడిపోయిందని సంబరపడిపోయాడు. ఇక ఆనాటి నుంచి ప్రతి రోజు ఫోన్‌లో మాట్లాడేవాడు.. ఛాటింగ్ చేసేవాడు.

అలా కొద్దిరోజుల తర్వాత ‘‘నీ ముఖం చూడాలనివుంది’’ అని అమ్మాయి అడిగేసరికి.. మనోడు ఆనందపడుతూ.. ఆమె అడ్రస్ తెలుసుకుని బర్‌పేట జిల్లా సుఖువజార్ గ్రామానికి వెళ్లాడు.. డోర్ కొట్టి తలుపు తెరిచి చూసి అవాక్కయ్యాడు..

కారణం ఆమె యువతి కాదు.. 60 ఏళ్ల బామ్మ.. మగదిక్కు లేని ఆమె.. యువకుడి కోసం తీవ్రంగా ఎదురుచూస్తూ ఉందట. దొరికిందే సందు అనుకున్న స్థానికులు వెంటనే బాలుడిని పట్టుకుని.. బలవంతంగా బామ్మగారితో పెళ్లి చేసేశారు.

విషయం తెలుసుకున్న అసోంకు చెందిన ఓ స్వచ్ఛంద సేవా సంస్థ.. బాలల హక్కుల సంఘానికి ఫిర్యాదు చేసింది. రాంగ్‌కాల్ చేసి ఎవరో ఒక అమ్మాయితో టైమ్ పాస్ చేద్దామనుకున్న బాలుడు.. అడ్డంగా బుక్కవ్వడంతో తీవ్రంగా ఏడుస్తున్నాడు.

PREV
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం