చెరువులో పడ్డ బస్సు: ఏడుగురు మృతి,పలువురికి గాయాలు

Published : Oct 20, 2018, 06:37 PM IST
చెరువులో పడ్డ బస్సు: ఏడుగురు మృతి,పలువురికి గాయాలు

సారాంశం

అసోం రాష్ట్రంలో శనివారం నాడు  ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన  బస్సు అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లింది


గౌహాతి: అసోం రాష్ట్రంలో శనివారం నాడు  ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన  బస్సు అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లింది.  ఈ ఘటనలో  ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 20 మంది గాయపడ్డారు.

గౌహాతి, ముకల్‌మువా మధ్య ఈ ప్రమాదం చోటు చేసుకొంది.  విషయం తెలిసిన వెంటనే అధికారులు హుటాహుటిన సంఘటనాస్థలికి చేరుకొని  సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.  స్థానికులు కూడ సహాయక చర్యల్లో అధికారులకు సహకరిస్తున్నారు.

 

క్షతగాత్రులను సమీప ఆసుత్రికి తరలించారు.  స్థానికంగా ఉన్న ఆసుపత్రుల్లో ప్రాథమిక చికిత్స చేయించి మెరుగైన  వైద్యం కోసం  ఏరియా ఆసుపత్రులకు తరలించారు. 

 అసోంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అసోం రాష్ట్ర రవాణా సంస్థ బస్సు అదుపు తప్పి చెరువులోకి జారిపడటంతో ఏడుగురు ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. మరో 20 మంది గాయపడ్డారు. గౌహతి, ముకల్‌మువా మధ్య ఈ ప్రమాదం చోటుచేసుకుంది.  అధికారులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని  స్థానికులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నాయి.

PREV
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం