దుర్గమ్మ అనుగ్రహం కోసం చిన్నారి తలనరికి.. రక్తంతో..

sivanagaprasad kodati |  
Published : Oct 21, 2018, 11:46 AM IST
దుర్గమ్మ అనుగ్రహం కోసం చిన్నారి తలనరికి.. రక్తంతో..

సారాంశం

విజయదశమి పండుగ నాడు అమ్మవారికి రకరకాల పూజలు చేసి ఆమె అనుగ్రహాన్ని పొందుతారు భక్తులు. అయితే మంత్రాలు, తంత్రాలను నమ్మి ఏకంగా చిన్నారి తల నరికి అమ్మవారికి సమర్పించారు ఇద్దరు వ్యక్తులు.

విజయదశమి పండుగ నాడు అమ్మవారికి రకరకాల పూజలు చేసి ఆమె అనుగ్రహాన్ని పొందుతారు భక్తులు. అయితే మంత్రాలు, తంత్రాలను నమ్మి ఏకంగా చిన్నారి తల నరికి అమ్మవారికి సమర్పించారు ఇద్దరు వ్యక్తులు.

వివరాల్లోకి వెళితే.. ఒడిశాలోని బొలంగిర్ జిల్లా సింధ్‌కేలా ఏరియాలోని నదీ తీరంలో తల లేని ఓ చిన్నారి మొండెం దొరికింది. దీనిపై స్థానికులు సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు దీని వెనకున్న మిస్టరీని ఛేదించేందుకు రంగంలోకి దిగారు.

పోలీసుల దర్యాప్తులో సదరు మృతదేహం సింధ్‌కేలా గ్రామానికి చెందిన తొమ్మిదేళ్ల బాలుడు ఘనశ్యామ్ రానాదిగా గుర్తించారు. ఈ బాలుడు అక్టోబర్ 13 నుంచి కనిపించడం లేదని తెలిసింది.

ఆ దిశగా ఆరా తీసిన పోలీసులు.. బంధువులను విచారించగా బాలుడి మామయ్య కుంజా రానా, అతని సోదరుడు సాంబాబన్ రానా‌లు దుర్గాపూజ రోజున బాలుడిని అమ్మవారికి బలిచ్చినట్లుగా తేలింది. వెంటనే వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతేడాది ఇదే ప్రాంతంలో క్షుద్రపూజలు చేసే కొందరు ఓ బాలుడిని నరబలి ఇచ్చిన ఘటన సంచలనం కలిగించింది.

PREV
click me!

Recommended Stories

Indigo Crisis: ఇండిగో ఎయిర్ లైన్స్‌కి ఏమైంది.. అస‌లీ గంద‌ర‌గోళం ఏంటి.?
Modi : అసోం టీ నుండి భగవద్గీత వరకు.. పుతిన్‌కు మోదీ ఇచ్చిన గిఫ్ట్‌లు ఇవే