ట్రాన్స్‌జెండర్లకు వివాహాలు... పెళ్లికి ముందు మెహందీ, సంగీత్

Siva Kodati |  
Published : Mar 31, 2019, 01:57 PM IST
ట్రాన్స్‌జెండర్లకు వివాహాలు... పెళ్లికి ముందు మెహందీ, సంగీత్

సారాంశం

తమకు పెళ్లిళ్లు కావని, వారు జీవితాంతం అలా ఉండాల్సిందేనా అని ఎంతోమంది ట్రాన్స్‌జెండర్లు కుమిలిపోతున్నారు. అయితే వారికి ఓ మనసు ఉంటుందని, నచ్చిన వారిని పెళ్లి చేసుకునే హక్కు వారికి కూడా ఉంటుందని ఓ సామాజిక కార్యకర్త ట్రాన్స్‌జెండర్లకు సామూహిక వివాహాలు జరిపించారు. 

వివరాల్లోకి వెళితే.. రాయ్‌పూర్‌కు చెందిన విద్య రాజ్‌పుత్ అనే సామాజిక కార్యకర్త ట్రాన్స్‌జెండర్ల హక్కుల కోసం పోరాడుతున్నారు. ఈ క్రమంలో శనివారం 15 ట్రాన్స్‌జెండర్ జంటలకు వివాహాలు జరిపారు.

హిందూ సంప్రదాయం ప్రకారం జరిగిన ఈ వేడుకకు ముందు ఉత్తరాదిన అనుసరించినట్లు మెహందీ, సంగీత్ నిర్వహించారు. వీరంతా ఛత్తీస్‌గఢ్‌తో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన వారు. ఎన్నో ఏళ్లుగా తమ కష్టాలను ఎవరూ పట్టించుకోలేదని మధు కిన్నర్ అనే ట్రాన్స్‌జెండర్ తెలిపారు.

కానీ ఈ రోజున తాము పెళ్లిళ్లు చేసుకోవటానికి చక్కటి అవకాశం దొరికిందన్నారు. భవిష్యత్తులో దేశ వ్యాప్తంగా ఇలాంటి కార్యక్రమాలు జరగడానికి ఇది స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. 

PREV
click me!

Recommended Stories

నిర్మాత తిని ప‌డేసిన బొక్క‌లు తిన్న రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఎందుక‌ని అడ‌గ్గా, ఊహ‌కంద‌ని ఆన్స‌ర్‌
Viral Video: ఏసీలో నుంచి వింత శ‌బ్ధాలు.. ఏంటా అని చూడ‌గా గుండె గుబేల్‌, వైర‌ల్ వీడియో