ఎద్దులబండ్ల పోటీలో చేలారేగిన వివాదం.. ఇరువర్గాల మధ్య విచక్షణారహితంగా కాల్పులు ..

Published : Nov 14, 2022, 12:45 PM ISTUpdated : Nov 14, 2022, 12:46 PM IST
ఎద్దులబండ్ల పోటీలో చేలారేగిన వివాదం.. ఇరువర్గాల మధ్య విచక్షణారహితంగా కాల్పులు ..

సారాంశం

ముంబయికి సమీపంలోని  అంబర్‌నాథ్‌లోని మహారాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎంఐడిసి)లో ఆదివారం జరిగిన ఎద్దుల బండ్ల రేసులో రెండు వర్గాల మధ్య విచక్షణారహితంగా కాల్పులు జరిగాయి. తొలుత ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగిందని, ఆ తర్వాత కాల్పుల ఘటన తెరపైకి వచ్చిందని సమాచారం.ఈ ఘటనపై సమాచారం అందుకున్న శివాజీనగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం 15 నుంచి 20 రౌండ్ల కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది.   

మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే సొంత జిల్లా థానేలోని అంబర్‌నాథ్ ప్రాంతంలో రోడ్డుపై పట్టపగలు కాల్పులు జరిగాయి. దీంతో పాదచారులు భయాందోళనకు గురయ్యారు.ఆదివారం జరిగిన ఎద్దుల బండ్ల రేసులో రెండు వర్గాల మధ్య తోపులాట జరగడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇరువర్గాలు దాదాపు 15-20 రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ కాల్పులు జరిపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గ్యాంగ్ వార్ తరహాలో జరిగిన కాల్పుల్లో ఎవరికీ ఎలాంటి గాయాలు జరగలేదని సమాచారం.  అయితే ఈ ఘటనతో ఆ ప్రాంతంలో భయాందోళన వాతావరణం నెలకొంది.

వైరల్ అవుతున్న వీడియోలో కొందరు దుండగులు రోడ్డుపక్కన పార్క్ చేసిన వాహనాల చుట్టూ నిలబడి ఉండగా, అవతలి వర్గం వారిపై కాల్పులు ప్రారంభించింది. ఈ క్రమంలో ప్రజలు తమ ప్రాణలను కాపాడుకోవడానికి అక్కడ పార్క్ చేసిన కార్ల వెనుక దాక్కుంటారు. కొందరు ప్రాణ భయంతో పరిగెత్తారు. 

పన్వేల్, కళ్యాణ్ సమూహాల మధ్య వివాదం

అంబర్‌నాథ్‌లో ఆదివారం ఎద్దుల బండ్ల పోటీ జరిగింది. ఇంతలో పన్వేల్‌కు చెందిన పండరిసేత్ ఫడ్కే, కళ్యాణ్‌కు చెందిన రాహుల్ పాటిల్ గ్రూపులుతో పాటు ఇతర గ్రూపులు పాల్గొన్నాయి. ఇరు వర్గాల మధ్య మొదట ఏదో ఒకదానిపై వాగ్వాదం జరిగింది. ఇది కాస్త..గొడవగా మారింది. ఆ తర్వాత కాల్పులు ప్రారంభమయ్యాయి. వివాదం,కాల్పుల గురించి సమాచారం అందిన వెంటనే అంబర్‌నాథ్ శివాజీ నగర్ పోలీస్ స్టేషన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే అప్పటికి ఇరువర్గాల ప్రజలు అక్కడి నుండి పారిపోయారు. నిందితుడిని గుర్తించిన పోలీసులు పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చేపట్టారు.

అంబర్‌నాథ్ మహారాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎంఐడిసి)లో ఆదివారం ఎద్దుల బండి రేసుపై రెండు గ్రూపుల మధ్య జరిగిన పోరులో షూటౌట్‌కు దారితీసింది. దాదాపు 15 రౌండ్ల బహిరంగ కాల్పుల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటనతో  స్థానికులు, వాహనదారులు భయాందోళనలతో పరుగెత్తారని ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని శివాజీ నగర్ పోలీస్ స్టేషన్‌ అధికారి తెలిపారు.అయితే ఈ కాల్పుల్లో ఒక గ్రూపుకు చెందిన కారు ధ్వంసమైంది. అంబర్‌నాథ్ ఎంఐడీసీలోని సుదామా హోటల్ సమీపంలో పలు వాహనాలు అటుగా వెళుతుండగా, ఆ ప్రాంతంలో పార్క్ చేస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలిపారు. ఈ ఘటనపై  కేసు కొని దర్యాప్తు ప్రారంభించినట్టు తెలిపారు. రెండు గ్రూపులకు గతంలో నేర చరిత్ర ఉందో లేదో తనిఖీ చేస్తామని, అలాగే..  స్థానికుల వాంగ్మూలాలు నమోదు చేశామని అధికారి తెలిపారు.
 

PREV
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం