కదులుతున్న రైలులో యువతిపై అత్యాచారం.. 15 మంది అరెస్ట్..

Published : Feb 14, 2022, 10:19 AM IST
కదులుతున్న రైలులో యువతిపై అత్యాచారం.. 15 మంది అరెస్ట్..

సారాంశం

సాయం పేరుతో ఓ మహిళను కాటేశాడో కామాంధుడు. రైలులో చోటు చూపిస్తానని మభ్యపెట్టి..రైలులోనే అత్యాచారానికి ఒడిగట్టాడు. దారుణమైన ఈ ఘటనలో పోలీసులు 15మందిని అరెస్ట్ చేశారు. 

భోపాల్ :  Sampark Kranti Express train యశ్వంతపూర్ నుంచి హజరత్.నిజాముద్దీన్ వెళ్తుండగా Madhya Pradesh రాష్ట్రంలోని భోపాల్ లో దారుణం జరిగింది. ఓ యువతిని సాయం పేరిట మభ్యపెట్టిన కిరాతకుడు రైలులోనే molestationకి పాల్పడ్డాడు యువతి రైలు ఎక్కిన తర్వాత ఆమెకు కూర్చునేందుకు చోటు దొరకలేదు. దీంతో వంట చేసే Bogieలో ఖాళీ ఉందని అక్కడ విశ్రాంతి తీసుకోవచ్చు అంటూ ఓ వ్యక్తి ఆమెను నమ్మించి అక్కడికి తీసుకెళ్లాడు.  

అక్కడ ఆమె నిద్రించే సమయంలో అఘాయిత్యానికి ఒడిగట్టాడు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన రైల్వే స్టేషన్కు చేరుకున్నారు. వంట చేసే భోగి వద్దకు వెళ్లగా అందులో ఉన్నవారు వెంటనే తలుపు తెరవలేదు. చాలాసేపు పోలీసుల ఒత్తిడితో అరగంట తర్వాత తెరిచారు. అక్కడ అపస్మారకస్థితిలో పడివున్న బాధితురాలిని పోలీసులు రక్షించి.. ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స అనంతరం జరిగిన విషయాన్ని ఆమె పోలీసులకు తెలిపింది. ఈ కేసుకు సంబంధించి మొత్తం 15 మంది అదుపులోకి తీసుకున్న పోలీసులు అసలు నిందితుడిని గుర్తించేందుకు విచారణ కొనసాగిస్తున్నారు. త్వరలో ఈ కేసులో నిందితుడిని గుర్తిస్తామని తెలిపారు.

ఇదిలా ఉండగా, నిరుడు జూన్ లోనూ మధ్యప్రదేశ్ లో దారుణ ఘటనే  చోటు చేసుకుంది. నడుస్తున్న రైలులో 21 యేళ్ల యువతి మీద అత్యాచారయత్నం చేసి, గొంతుకోసి చంపి పడేశారు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సెహోర్ లో జరిగింది. ఇండోర్-బిలాస్ పూర్ రైలులో నుంచి సెహోర్ రైల్వే స్టేషన్ సమీపంలో యువతి మృతదేహాన్ని తాము స్వాధీనం చేసుకున్నామని జిల్లా సీనియర్ పోలీసు అధికారి ఎస్ఎస్ చౌహాన్ చెప్పారు. 

రైలులో ఒక మహిళ తమ వైపు పరుగెత్తుకు రావడం చూశామని ప్రయాణికులు చెప్పారు. ఇండోర్-బిలాస్ పూర్ రైలు స్లీపర్ కోచ్ లో ప్రయాణిస్తున్న తన సోదరిని కొంతమంది లైంగికంగా వేధించారని, దీంతో డయల్ 100కు ఫోన్ చేసి చెప్పానని మృతురాలి సోదరుడు చెప్పారు. బాధిత యువతి గొంతుకోసి నిందితులు పారిపోయారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. రైల్వే పోలీసులు మృతదేహాన్ని పోస్టు మార్టం కోసం తరలించి కేసును దర్యాప్తు చేశారు.

నిరుడు ఎప్రిల్ లో ఉత్తరప్రదేశ్ లో జరిగిన మరో ఘటనలో రైలులో నన్స్ ని వేధించిన కేసులో రైల్వే పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కేరళకు చెందిన నన్స్ మార్చి, 2021లో ఉత్కల్ ఎక్స్ ప్రెస్ రైలులో ప్రయాణించారు. ఆ సమయంలో.. ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీ రైల్వే స్టేషన్ సమీపంలోని రైలులోని కొందరు ఆకతాయిలు నన్స్ ని వేధింపులకు గురిచేశారు.  వారిని రైలులో నుంచి కిందకు దించేసినట్లు తెలుస్తోంది.  దీంతో.. బాధిత నన్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తులో భాగంగా ఇటీవల నిందితులను అరెస్టు చేశారు.అయితే ముందుగా నిందితులను గుర్తించడం కష్టమైందని ఎట్టకేలకు వారిని పట్టుకుని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు.

PREV
click me!

Recommended Stories

IRCTC New Rates: టికెట్ ధరలు పెంచిన రైల్వే.. హైదరాబాద్ నుంచి వైజాగ్, తిరుపతికి రేట్లు ఇవే !
Success Story: సెక్యూరిటీ గార్డు కొడుకు.. 3 కంపెనీలకు బాస్ ! ఇది కదా సక్సెస్ స్టోరీ అంటే !