భారతీయ విద్యార్థులకు 140,000 వీసాలు.. యూఎస్ ఎంబసీ రికార్డు..

By SumaBala Bukka  |  First Published Nov 29, 2023, 9:30 AM IST

"భారతదేశంలోని మా రాయబార కార్యాలయం, కాన్సులేట్‌లు 140,000 కంటే ఎక్కువ విద్యార్థి వీసాలను జారీచేసి ఆల్ టైమ్ రికార్డ్‌ను సాధించాయి" అని యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ మంగళవారం ప్రకటించింది.


వాషింగ్టన్ : భారత్ లోని యుఎస్ ఎంబసీ, దాని కాన్సులేట్‌లు అక్టోబర్ 2022 - సెప్టెంబర్ 2023 మధ్య 140,000 స్టూడెంట్ వీసాలను జారీ చేసి..  ఆల్-టైమ్ రికార్డ్‌ను చేరుకున్నాయి. ఈ మేరకు యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ మంగళవారం ప్రకటించింది. "భారతదేశంలోని మా రాయబార కార్యాలయం, కాన్సులేట్‌లు 140,000 కంటే ఎక్కువ విద్యార్థి వీసాలను జారీ చేసిన ఆల్ టైమ్ రికార్డ్‌ను సాధించాయి" అని తెలిపింది. యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ మాట్లాడుతూ.. "అక్టోబర్ 2022 నుండి సెప్టెంబర్ 2023 వరకు (2023 ఫెడరల్ ఆర్థిక సంవత్సరం), డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ ప్రపంచవ్యాప్తంగా 10 మిలియన్లకు పైగా నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాలను రికార్డు స్థాయిలో జారీ చేసింది" అని చెప్పుకొచ్చింది. 

సగం యూఎస్ ఎంబసీలు, కాన్సులేట్‌లలో గతంలో కంటే ఎక్కువ వలసేతర వీసాలను ఇచ్చాయి. వీటితోపాటు.. యూఎస్ రాయబార కార్యాలయం వ్యాపారం, పర్యాటకం కోసం దాదాపు ఎనిమిది మిలియన్ల సందర్శకుల వీసాలు జారీ చేసింది. ఇది 2015 నుండి అన్ని ఆర్థిక సంవత్సరాలకంటే ఎక్కువే అని ఒక ప్రకటనలో పేర్కొంది.

Latest Videos

undefined

ఉత్తరాఖండ్ టన్నెల్ నుండి బైటికొచ్చిన కార్మికులతో ప్రధాని మోదీ ఫోన్‌ సంభాషణ..

అంతేకాకుండా, యూఎస్ ఎంబసీ, కాన్సులేట్‌లు 600,000 కంటే ఎక్కువ విద్యార్థి వీసాలను జారీ చేశాయి. 2017 ఆర్థిక సంవత్సరం నుండి ఇప్పటివరకు యేటా జారీచేసిన వీసాలకంటే ఇవి అత్యధికం. కఠినమైన జాతీయ భద్రతా ప్రమాణాలను పాటిస్తూ, తరచుగా ప్రయాణీకులు దౌత్యకార్యాలయం లేదా కాన్సులేట్‌ను సందర్శించాల్సిన అవసరం లేకుండా వారి వీసాలను పునరుద్ధరించడానికి అనుమతించే ఇంటర్వ్యూ మినహాయింపు అధికారాలను విస్తరించడం వంటి వినూత్న పరిష్కారాల కారణంగా ఈ విజయాలు సాధ్యమయ్యాయని ప్రకటన పేర్కొంది.

"భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, ఎంపిక చేసిన వీసా వర్గాలలో దేశీయ పునరుద్ధరణ ఎంపిక వంటి కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి అవకాశాలను అంచనా వేయడానికి, కొత్త సాంకేతికతలకోసం వెతుకుతున్నాం" అని అందులో పేర్కొన్నారు. గత నెలలో, యూఎస్ మిషన్ టు ఇండియా 2023లో ఒక మిలియన్ నాన్-ఇమ్మిగ్రెంట్ వీసా దరఖాస్తులను ప్రాసెస్ చేయాలనే లక్ష్యాన్ని అధిగమించింది. గత సంవత్సరం 1.2 మిలియన్లకు పైగా భారతీయులు యుఎస్‌ని సందర్శించారని, ఇది ప్రపంచంలోని అత్యంత బలమైన ప్రయాణ సంబంధాలలో ఒకటిగా ఉందని భారత్ లో యుఎస్ ఎంబసీ, కాన్సులేట్‌లు ఒక ప్రకటనలో తెలిపాయి.

"ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వీసా దరఖాస్తుదారులలో భారతీయులు 10 శాతానికి పైగా ఉన్నారు. ఇందులో మొత్తం స్టూడెంట్ వీసా దరఖాస్తుదారులలో 20 శాతం, మొత్తం హెచ్ అండ్ ఎల్-కేటగిరీ (ఉపాధి) వీసా దరఖాస్తుదారులలో 65 శాతం ఉన్నారు. ఈ వృద్ధిని యునైటెడ్ స్టేట్స్ స్వాగతించింది" అని ప్రకటన పేర్కొంది. ఈ నెల ప్రారంభంలో, భారతదేశంలోని యుఎస్ రాయబారి ఎరిక్ గార్సెట్టి జాతీయ రాజధానిలోని యుఎస్ మిషన్‌ను సందర్శించి భారతీయులలో యుఎస్ విజిటర్ వీసాల కోసం "డిమాండ్" ఉండడాన్నిని పర్యవేక్షించారు. 'సూపర్ సాటర్డే'లో అదనపు వీసా దరఖాస్తుదారులకు సహాయం చేయడానికి గార్సెట్టి ప్రత్యేక అతిథిగా ఉన్నారని యూఎస్ ఎంబసీ తెలిపింది.

click me!