ఏపీకి చెందిన వ్యక్తికి కరోనా... కలకలం: యూపీలో 14 గ్రామాల మూసివేత

By Siva Kodati  |  First Published Apr 13, 2020, 5:20 PM IST

భారతదేశంలో కరోనా వైరస్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. వ్యాప్తిని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను విధించినప్పటికీ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి కరోనా పాజిటివ్ తేలడంతో ఉత్తరప్రదేశ్‌లో 14 గ్రామాలను మూసివేశారు. 


భారతదేశంలో కరోనా వైరస్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. వ్యాప్తిని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను విధించినప్పటికీ కేసులు పెరుగుతూనే ఉన్నాయి.

దీంతో కోవిడ్‌ను నియంత్రించడానికి రెడ్, ఆరంజ్, గ్రీన్ జోన్లు, కంటైన్మెంట్ ఏరియాల సూత్రాలను అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి కరోనా పాజిటివ్ తేలడంతో ఉత్తరప్రదేశ్‌లో 14 గ్రామాలను మూసివేశారు.

Latest Videos

Also Read:కరోనా లాక్ డౌన్: పెరిగిన గంగా నది నీటి నాణ్యత, తగ్గిన కాలుష్యం

వివరాల్లోకి వెళితే.. బడౌన్ జిల్లా భవానీ‌పూర్ కాలీలో ఏపీకి చెందిన ఓ వ్యక్తి నివసిస్తున్నాడు. అతను గత నెలలో  ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని వచ్చాడు. అయితే అతనికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో.. అతను నివసిస్తున్న ప్రాంతానికి 3 కిలోమీటర్ల పరిధిలో ఉన్న 14 గ్రామాలను మూసివేస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.

మరోవైపు ఆగ్రాలో సోమవారం 30 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య 134కి చేరుకుంది. దీనిలో దాదాపు 60 మంది ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారని, ఆగ్రా జిల్లా కలెక్టర్ వెల్లడించారు.

Also Read:చేతుల్లో రోజుల బిడ్డతో.. విధుల్లోకి ఏపీ లేడీ ఐఏఎస్ అధికారి

వీటితో కలిపి ఉత్తరప్రదేశ్‌లో కరోనా సోకిన వారి సంఖ్య 483కి చేరింది. కాగా గడచిన 24 గంటల్లో భారత్‌లో కొత్తగా 796 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ సోమవారం ప్రకటించారు. దీంతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 9,152కి చేరుకోగా... 308 మంది ప్రాణాలు కోల్పోయారు. 

click me!