పికప్ వ్యాన్ బోల్తా పడిన ఘటనలో మధ్యప్రదేశ్ లో తీవ్ర విషాదాన్ని నింపింది. పదుల సంఖ్యలో మృత్యువాత పడ్డారు.
మధ్యప్రదేశ్ : గురువారం నాడు మధ్యప్రదేశ్లోని దిండోరిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పికప్ వ్యాన్ బోల్తా పడడంతో అందులో ఉన్న 14 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో 20 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. ఘటనకు సంబంధించిన సమాచారం తెలియడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు హుటాహుటిన.. క్షతగాత్రులందరినీ చికిత్స కోసం షాపురా ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులలో కూడా చాలామంది పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. దీనిమీద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.
ప్రమాదంలో చనిపోయిన వారు, క్షతగాత్రులు అందరూ షాపురా ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొని తమ స్వగ్రామమైన అమ్హై డియోరీకి వెళ్తున్నారని పోలీసులు తెలిపారు. షాపురా పోలీస్ స్టేషన్, బిచియా పోలీస్ పోస్ట్ ఏరియా పరిధిలో ఉన్న బద్జార్ ఘాట్ లో ఈ ఘటన జరిగినట్లుగా చెబుతున్నారు.
One Nation-One Election: 2029 నాటికి జమిలి ఎన్నికలు! రాజ్యాంగ సవరణకు లా కమిషన్ సిఫార్సులు!
ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి…బిచియా-బర్జార్ గ్రామ సమీపంలో బుధవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. ఫుల్ స్పీడుతో వస్తున్న ఓ పికప్ వాహనం ఒక్కసారిగా బ్యాలెన్స్ తప్పడంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో బ్యాలెన్స్ కోల్పోయిన బండి రోడ్డు పక్కన ఉన్న గుంతలో బోల్తా పడింది. ఆ సమయంలో వాహనంలో ఉన్నవారిలో 14 మంది అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఆరుగురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు.
షాపురా పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఓ సామాజిక కార్యక్రమంలో పాల్గొనేందుకు వీరంతాఅమ్హై డియోరీకి నుంచి వెళ్లారు. మృతుల్లో 9 మంది పురుషులు, ఐదుగురు మహిళలు ఉన్నారు. ఇక గాయపడిన వారిలో 12 మంది మహిళలు 9 మంది పురుషులు ఉండగా…వీరిలో నలుగురిని జబల్పూర్ కు తరలించినట్లు పోలీసులు చెబుతున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మృతుల్లో 72 సంవత్సరాల మహా సింగ్, 16 సంవత్సరాల పితంతో పాటు అనేక వయసుల వారు ఉన్నారు.