ముంబయిలోని హాస్పిటల్‌లో 132 ఏళ్ల కిందటి సొరంగం వెలుగులోకి.. ఎలా తెలిసిందంటే?

By Mahesh KFirst Published Nov 4, 2022, 8:11 PM IST
Highlights

ముంబయిలో ప్రభుత్వ పరిధిలోని జేజే హాస్పిటల్‌లో ఓ సొరంగం బయటపడింది. 132 ఏళ్ల క్రితం బ్రిటీషు వారి పాలనలో ఈ సొరంగం నిర్మించినట్టు ఫౌండేషన్ స్టోన్‌లో ఉన్నట్టు అధికారులు వివరించారు.
 

ముంబయి: చరిత్ర ఎప్పుడూ ఆసక్తికరంగా ఉంటుంది. ముఖ్యంగా ఇది వరకు బయటకు తెలియని కట్టడాలు, గుహలు, సొరంగాలు, నాణేలు, ఇతర వస్తువులు బయటపడ్డప్పుడు ఈ ఆసక్తి రెట్టింపు అవుతుంది. ఇలాంటి ఓ సందర్భమే ఇప్పుడు ముంబయిలో ముందుకు వచ్చింది. ప్రభుత్వ పరిధిలోని జేజే హాస్పిటల్‌లో ఓ రహస్య సొరంగం బయటపడింది.

ముంబయిలోని జేజే హాస్పిటల్‌లో 132 ఏళ్ల కిందటి సొరంగం వెలుగులోకి వచ్చింది. ఈ సొరంగాన్ని బ్రిటీషువారీ కాలంలో నిర్మించినట్టు తెలుస్తున్నది. 1890లో నిర్మించినట్టు ఫౌండేషన్ స్టోన్‌లో కనిపించినట్టు అధికారులు వివరించారు.

ఈ హాస్పిటల్ ప్రాంగణలోనే ఓ భవంతి ఉన్నది. ఆ భవంతి కింద ఈ సొరంగం బయటపడింది. ఈ భవనాన్ని గతంలో మహిళలు, శిశువులకు చికిత్స అందించడానికి ఉపయోగించినట్టు అధికారులు విలేకరులకు తెలియజేశారు. ఆ తర్వాత దీన్ని నర్సింగ్ కాలేజీగా మార్చినట్టు తెలిపారు.

Also Read: ఢిల్లీలో బయటపడ్డ ఎర్రకోట సొరంగం.. బ్రిటీషర్లు దీనిని దేనికోసం వినియోగించారంటే?

ఈ నర్సింగ్ కాలేజీలో వాటర్ లీకేజీ సమస్య వచ్చిందని, ఈ వాటర్ లీకేజీ సమస్య ఫిర్యాదు అందడంతో తాము పరిశీలించడానికి వచ్చామని అధికారులు వివరించారు. పీడబ్ల్యూడీ ఇంజినీర్లు, సెక్యూరిటీ గార్డులు ఈ బిల్డింగ్‌ను సర్వే చేసినట్టు చెప్పారు. ఈ సొరంగం ఫౌండేషన్ స్టోన్ పై 1890 సంవత్సరం మెన్షన్ చేసి ఉన్నదని పేర్కొన్నారు. 

తొలుత వాటర్ లీకేజీని పరిశీలించిన తర్వాత కింద ఏదో బేస్‌మెంట్ ఉన్నట్టు కొందరు సిబ్బంది తమకు తెలియజేశారని తెలిపారు. ఆ తర్వాతే తాము తదుపరి ఇన్‌స్పెక్షన్‌ చేయడానికి పూనుకున్నట్టు చెప్పారు. ఆ తర్వాతే తాము ఈ సొరంగాన్ని కనుగొన్నట్టు చెప్పారు.

ఇదిలా ఉండగా, అత్యంత కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థను కలిగి ఉన్న అమెరికా, మెక్సికో దేశాల సరిహద్దుల‌ మ‌ధ్య ఈ ఏడాది మే నెలలో భారీ సొరంగం బ‌య‌ట‌ప‌డింది. శాన్ డియాగోలోని ఓటే మీసా సరిహద్దు క్రాసింగ్ సమీపంలో భారీ, విశాల‌మైన‌  సొరంగాన్ని భ‌ద్ర‌తా బ‌ల‌గాలు గుర్తించాయి. ఈ సొరంగం ద్వారా మెక్సికోలోని టిజువానా నుంచి  అమెరికాలోని శాన్ డియాగో కు వెళ్ల‌వ‌చ్చ‌ని గుర్తించారు. 

Also Read: తైవాన్ రైలు ప్రమాదం : సొరంగంలో పట్టాలు తప్పి.. 36మంది మృతి..

ఈ సొరంగంలో స్వంత రైల్వే లైన్, విద్యుత్, ప‌టిష్ట‌మైన గోడ‌ల‌తో ఏర్పాటు చేయబడింది. సొరంగం పొడవు 1744 అడుగులు, లోతు దాదాపు 61 అడుగులు ఉన్న‌ట్టు హోంల్యాండ్ సెక్యూరిటీ అధికారులు గుర్తించారు. ఈ సొరంగం ద్వారా అమెరికా-మెక్సికో సరిహద్దులో డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్న‌ట్టు అమెరికా భ‌ద్ర‌తా బ‌ల‌గాలు గుర్తించాయి. గత రెండు దశాబ్దాలలో డజనుకు పైగా సొరంగాలు కనుగొనబడిన ప్రాంతంలోనే ఈ సొరంగం కనుగొనబ‌డ‌టం గ‌మ‌నార్హం.   

ఈ సొరంగం ఎంతకాలం నుంచి పనిచేస్తుందో, ఎంత వరకు డ్రగ్స్‌ ఉన్నాయో తెలియరాలేదని అమెరికా అధికారులు తెలిపారు. విచారణ స‌మ‌యంలో 799 కిలోల (1,761 పౌండ్లు) కొకైన్, 75 కిలోల (165 పౌండ్లు) మెథాంఫేటమిన్,  1.6 కిలోల (3.5 పౌండ్లు) హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.193 కోట్లకు పైమాటే.

click me!