వీడు మనిషేనా.. మానసిక వికలాంగురాలిపై అత్యాచారం.. ఆపై..

Published : Sep 07, 2023, 01:46 AM IST
వీడు మనిషేనా.. మానసిక వికలాంగురాలిపై అత్యాచారం.. ఆపై..

సారాంశం

ఉత్తరప్రదేశ్ లో ఘోరం జరిగింది. ఆడుకోవడానికి బయటకు వెళ్లిన ఓ మానసిక వికలాంగురాలైన మైనర్ బాలికపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి సోదరుడి ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన బయటకు వచ్చింది.

పాలబుగ్గల పసివాళ్లు, కాటికి కాళ్లు చాపిన వృద్ధులు.. కామాంధులకు ఎవరైతేనేం.. ఆడవారు కనిపిస్తే చాలు మృగాల్లా రెచ్చిపోతున్నారు. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా ఆ మృగాళ్ల ప్రవర్తనలో మార్పు రావడం లేదు. దేశ రాజధాని నుంచి మారుమూల పల్లెటూరు వరకూ నిత్యం ఏదోక చోట వారిపై దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్ లో దారుణం జరిగింది.  

వివరాల్లోకెళ్తే.. ఉత్తరప్రదేశ్ లోని బులంద్‌షహర్ జిల్లా ఖుర్జా నగర్ ప్రాంతంలో 13 ఏళ్ల మానసిక వికలాంగ బాలికపై అదే గ్రామానికి చెందిన ఓ కామాంధుడు బుధవారం అత్యాచారానికి పాల్పడ్డాడు. మానసిక వికలాంగుడైన తన సోదరిపై కన్హయ్య(30) అత్యాచారం చేశాడని బాలిక సోదరుడు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బాలిక గ్రామంలో ఆడుకోవడానికి వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగిందని పోలీసు సూపరింటెండెంట్ (రూరల్) బజరంగ్ బాలి చౌరాసియా తెలిపారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం పంపించారు. చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు తెలిపారు.

PREV
click me!

Recommended Stories

IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు
Nuclear Devices in Himalayas : నెహ్రూ, ఇందిరాలే ప్రస్తుత ప్రకృతి విపత్తులకు కారణమా..?