మరో దారుణం: బాలికను చంపేసి గుంతలో పాతిపెట్టారు

Published : Mar 03, 2021, 08:20 AM ISTUpdated : Mar 03, 2021, 08:23 AM IST
మరో దారుణం: బాలికను చంపేసి గుంతలో పాతిపెట్టారు

సారాంశం

మూడు రోజుల క్రితం కనిపించకుండా పోయిన 12 ఏళ్ల బాలిక శవం ఓ ఇంటిలోని గుంతులో పాతి పెట్టి ఉండడం కనిపించింది. ఆ సంఘటన తర్వాత పోలీసులు ఇంటికి చెందిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

బులంద్ షహర్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణం చోటు చేసుకుంది. ఆరు రోజుల క్రితం కనపించకుండా పోయిన 12 బాలిక శవం ఓ ఇంటిలోని గుంతలో పాతిపెట్టి ఉండడం కనిపించింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బులంద్ షహర్ జిల్లాలో జరిగింది. గ్రామంలోని ఆమె ఇంటికి సమీపంలోనే ఆమె శవమై తేలింది. 

గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఘటనకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. ప్రస్తతం అతను పరారీలో ఉన్నాడు. ఫిబ్రవరి 25వ తేదీన బాలిక తన కుటుంబ సభ్యులతో పాటు పొలం పనిచేస్తూ ఉండింది. అయితే, దాహం వేయడంతో తాను ఇంటికి వెళ్తున్నట్లు వారికి చెప్పి అక్కడి నుంచి బయలుదేరింది. 

అయితే, ఆ తర్వాత ఆమె జాడ తెలియలేదు. దీంతో ఫిబ్రవరి 28వ తేదీన తల్లిదండ్రులు మిస్సింగ్ కేసు పెట్టారు బాలిక తమ ఇంటికి వంద మీటర్ల దూరంలో ఉన్న పొలంలో తన తల్లి, ఇద్దరు సిస్టర్స్ తో పనిచేస్తూ ఉండింది. ఇంటికి వెళ్లి తిరిగి రాకపోవడంతో సిస్టర్స్ ఆమె కోసం కేకలు వేశారు. అయితే అవతలి నుంచి ఏ విధమైన సమాధానం రాలేదు. దాంతో తమ సోదరి ఇంటికి వెళ్లి ఉంటుందని భావించారు. 

పనులు ముగించుకుని వచ్చిన తర్వాత చూస్తే బాలిక కనిపించలేదు. దాంతో ఆమె కోసం కుటుంబ సభ్యులు గాలింపు చేపట్టారు సాయంత్రం అదే ప్రదేశానికి వచ్చారు. అక్కడ ఓ వ్యక్తి మద్యం సేవిస్తూ కనిపించాడు. కానీ బాలిక మాత్రం కనిపించలేదు. పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ముందు కుటుంబ సభ్యులు రెండు మూడు రోజులు బాలిక కోసం గాలించారు. 

పోలీసులతో కలిసి గాలింపు చేపట్టిన స్థానికులకు ఇంట్లో ఓ చోటు గుంత తవ్వినట్లు కనిపిచింది. దాంతో తవ్వకం ప్రారంభించారు తవ్వి చూస్తే బాలిక శవం కనిపించింది.  ఆ ఇ్లల్లు తండ్రీకొడుకులకు సంబంధించింది. తండ్రిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. కుమారుడు మాత్రం పరారీలో ఉన్నాడు. 

PREV
click me!

Recommended Stories

Census 2027 : వచ్చేస్తున్న డిజిటల్ జనాభా లెక్కలు.. పేపర్ లేదు, పెన్ను లేదు.. అంతా యాప్ ద్వారానే !
IndiGo : ఇండిగో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సీఈఓ పీటర్‌ ఎల్బర్స్‌ క్షమాపణలు.. బిగ్ అప్డేట్ !