ఈ 12యేళ్ళ బాలుడు వండర్ కిడ్.. ఆసియాలో తొలిసారిగా 65రోజులు ఎక్మోపై మృత్యువుతో పోరాడి గెలిచాడు..

Published : Dec 25, 2021, 09:38 AM IST
ఈ 12యేళ్ళ బాలుడు వండర్ కిడ్.. ఆసియాలో తొలిసారిగా  65రోజులు ఎక్మోపై మృత్యువుతో పోరాడి గెలిచాడు..

సారాంశం

రోగి మా దగ్గరికి వచ్చినప్పుడు అతని ఊపిరితిత్తులు పూర్తిగా ఇన్ ఫెక్ట్ అయ్యాయి, గట్టిపడుతున్నాయి. అతని శరీరానికి ఆక్సిజన్ సరఫరా చేయలేకపోతున్నాయి. ECMO సపోర్ట్‌తో అతని ఊపిరితిత్తులకు విశ్రాంతి లభించింది. దీంతో క్రమంగా స్వస్థత పొందాడు. ఊపిరి తిత్తులు బాగుపడ్డాయి. స్వయంగా పనిచేసే సామర్థ్యాన్ని పునరిద్దరించుకున్నాయి

హైదరాబాద్ : పన్నేండేళ్ల చిన్నారి. కరోనా వచ్చింది. ఊపిరితిత్తుల్లో ఇన్ ఫెక్షన్ ఎక్కువయ్యింది. శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారి, మూతపిండాలు, కాలేయం పనితీరు దెబ్బతింది. రక్తంలోనూ ఇన్ ఫెక్షన్ సోకింది. ఈ బాలుడు 65 రోజులు ECMO మీద ఉండి.. పూర్తిగా కోలుకున్నాడు.

ఉత్తరప్రదేశ్‌లోని లక్నోకు చెందిన ఈ బాలుడని తీవ్రమైన కోవిడ్-19 ఇన్‌ఫెక్షన్ తో బాధపడుతుండడంతో విమానంలో.. 65 రోజుల కిందట హైదరాబాద్ లోని KIMS హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ అతనికి  ECMO థెరపీ  అందించారు.  రెండు నెలలకు పైగా వెనో-సిర ECMO సామర్థ్యాలను ఉపయోగించి లైఫ్ సపోర్ట్‌లో ఉన్నాడు.
ECMO సపోర్ట్‌లో ఉండి పూర్తిగా కోలుకోవడం దేశంలో ఇదే మొదటికేసు. ఎక్కువ కాలం ఎక్మో మీద ఉంది కూడా ఇదే ఘటన. 

"రోగి మా దగ్గరికి వచ్చినప్పుడు అతని ఊపిరితిత్తులు పూర్తిగా ఇన్ ఫెక్ట్ అయ్యాయి, గట్టిపడుతున్నాయి. అతని శరీరానికి ఆక్సిజన్ సరఫరా చేయలేకపోతున్నాయి. ECMO సపోర్ట్‌తో అతని ఊపిరితిత్తులకు విశ్రాంతి లభించింది. దీంతో క్రమంగా స్వస్థత పొందాడు. ఊపిరి తిత్తులు బాగుపడ్డాయి. స్వయంగా పనిచేసే సామర్థ్యాన్ని పునరిద్దరించుకున్నాయి’ అని KIMS హార్ట్ & లంగ్ ఇన్‌స్టిట్యూట్‌లోని ట్రాన్స్‌ప్లాంట్ పల్మోనాలజీ చీఫ్ డాక్టర్ విజిల్ చెప్పారు.

చాలా రోజులు మంచానికే పరిమితం కావడంతో కదలికల్లేకుండా ఉన్న శరీరభాగాలను పూర్వ స్థితికి తీసుకొచ్చేందుకు ఫిజియోథెరపీకి పంపారు. చికిత్సకు సంబంధఇంచిన వివరాలను కిమ్స్ సీఈవో అభినయ్ బొల్లినేని, ఊపిరితిత్తుల మార్పిడి నిపుణుడు డాక్టర్‌ సందీప్‌ అత్తావర్, పల్మనాలజిస్ట్‌ డాక్టర్‌ విజయ్, ఫిజిషియన్ బీపీయన్ బీపీసింగ్ శుక్రవారం విలేకరులకు వివరించారు. చిన్న పిల్లలు ఎక్మో మీద సుదీర్ఘ కాలం ఉండి కోలుకోవడం అరుదైన అంశమని, ఇది ఆసియాలోనే మొదటిదని వైద్యులు వెల్లడించారు. 

పద్మా దేవేందర్ రెడ్డి భర్తపై చర్యలేవి..? హైకోర్టు సీరియస్..!

ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోకు చెందిన  శౌర్య (12) సెప్టెంబర్ రెండో వారంలో కరోనా బారిన పడ్డాడు. చికిత్స కోసం తల్లిదండ్రులు స్థానిక మిడ్ లాండ్ హెల్త్ కేర్ అండ్ రీసెర్చ్ సెంటర్ లో చేర్చారు. తీవ్రమైన నిమోనియా వల్ల శ్వాస తీసుకోవడం కష్టమయ్యింది. అప్పటికే బాలుడికి ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించింది.

కుమారుడిని ఎలాగైనా కాపాడుకోవాలని మెరుగైన వైద్యం కోసం  నగరంలోని కిమ్స్ ఆసుపత్రి వైద్యులు బాలుడు తల్లిదండ్రులు ఆశ్రయించారు. కుమారుడి ఆరోగ్య పరిస్థితిని వివరించారు. డాక్టర్లు చికిత్సకు అంగీకరించడంతో ప్రత్యేక విమానంలో వెంటిలేటర్ సపోర్టుతో సెప్టెంబర్ 25న సికింద్రాబాద్ కిమ్స్ కు తరలించారు.

బాలుడికి వీనోవీనస్ ఎక్మో సపోర్టుతో బాలుడికి వైద్య సేవలు అందించటం ప్రారంభించారు. అప్పటికే మూత్రపిండాల పనితీరు దెబ్బతినడంతో డయాలసిస్ చేశారు. రక్తంలో ఇన్ఫెక్షన్ లెవల్స్ ఎక్కువయ్యాయి. యాంటీబయాటిక్ మందులు వాడి ఇన్ఫెక్షన్ రేటు తగ్గించారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 65 రోజులు ఎక్మోపై ఉంచి వైద్యసేవలు అందించారు.

సుదీర్ఘకాలం వైద్య సేవల తర్వాత బాలుని ఆరోగ్య పరిస్థితి మెరుగు పడింది. చాలా రోజులు మంచానికే పరిమితం కావడం వల్ల కాళ్లు, చేతులు, ఇతర శరీర భాగాల కదలికలు లేకుండా పోవడంతో.. ఫిజియోథెరపీ ద్వారా అవయవాలను పూర్వస్థితికి తీసుకురావాలి అని భావించారు. ఆ మేరకు రెండు రోజుల క్రితం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసి స్థానికంగా ఉన్న ఓ రిహాబిలిటేషన్ సెంటర్ కు సిఫార్సు చేశారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్
భార‌త్‌లో ల‌క్ష‌ల కోట్ల పెట్టుబడులు పెడుతోన్న అమెజాన్‌, గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌.. భ‌విష్య‌త్తులో ఏం జ‌ర‌గ‌నుందంటే?