యూపీలో మరో దారుణం: సామూహిక అత్యాచారానికి గురై 12 ఏళ్ల బాలిక మృతి

By Mahesh RajamoniFirst Published Jun 7, 2023, 8:11 PM IST
Highlights

Basti District: ఉత్త‌రప్ర‌దేశ్ లో సామూహిక అత్యాచారానికి గురై 12 ఏళ్ల బాలిక మృతి చెందింది. బాలిక కూరగాయలు కొనేందుకు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మోను సాహ్ని, రాజన్ నిషాద్, కుందన్ సింగ్ అనే ముగ్గురు నిందితులు బాలిక‌ను కిడ్నాప్ చేసి, నిర్మానూష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.
 

12-Year-Old Dies After Being Gang-Raped: ఉత్తరప్రదేశ్ లోని బస్తీలో సామూహిక అత్యాచారానికి గురై 12 ఏళ్ల బాలిక మృతి చెందింది. గౌర్ ప్రాంతంలో సోమవారం బాలిక కూరగాయలు కొనేందుకు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. మోను సాహ్ని, రాజన్ నిషాద్, కుందన్ సింగ్ అనే ముగ్గురు నిందితులు ఆమెను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకడం ప్రారంభించగా, సింగ్ ఇంటి సమీపంలో ఆమె అపస్మారక స్థితిలో పడి ఉందని సాహ్ని వారికి సమాచారం ఇచ్చారు. బాలికను ఆసుపత్రికి తరలించగా, సోమవారం సాయంత్రం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

నిందితుడు మోను సాహ్నికి బాలికతో పరిచయం ఉందనీ, బాలికను తనతో పాటు తీసుకెళ్లింది అతనేనని, అతనితో పాటు మరో ఇద్దరు కలిసి అత్యాచారానికి పాల్పడ్డారని ఎస్పీ గోపాల్ కృష్ణ చౌదరి తెలిపారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలిపారు. ఈ మేరకు ముగ్గురిపై అత్యాచారం, హత్య అభియోగాలపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నిందితులను బీజేపీ సభ్యులు కాపాడుతున్నారని ఆరోపిస్తూ వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ స్థానికులు ఆందోళనకు దిగారు.

యోగి స‌ర్కారుపై అఖిలేష్ యాదవ్ ఫైర్.. 

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని బస్తీ జిల్లాలో బాలిక‌పై జరిగిన అత్యాచారం కేసులో రాజకీయ ప్రతిస్పందనలు మొదలయ్యాయి. ఈ విషయంపై ఎస్పీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ స్పందిస్తూ.. ముఖ్య‌మంత్రి యోగి అదిత్యానాథ్ నాయ‌క‌త్వంలోని బీజేపీ స‌ర్కారుపై విమ‌ర్శ‌లు గుప్పించారు. రాష్ట్ర ప్రభుత్వ శాంతిభద్రతలపై ప్రశ్నలు లేవనెత్తిన ఆయ‌న‌.. నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. 

పెండ్లి వేడుకలో.. 

యూపీలో గ‌త నెల‌లో ఓ పెండ్లి వేడుక‌లో మైనర్ల‌పై లైంగిక‌దాడి ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఓ వివాహ వేడుకలో ఇద్దరు మైనర్ బాలికలపై గుర్తుతెలియని వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడని, బాధితులను ఆస్పత్రికి తరలించామని పోలీసులు తెలిపారు. షేర్ కోట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో శనివారం (మే 27) రాత్రి ఓ పెళ్లి బృందం ('బరాత్') వచ్చింది. ఈ వేడుకలో ఆడుతున్న డీజేను ఐదేళ్లు, మరో ఆరేళ్ల వయసున్న ఇద్దరు అమ్మాయిలు  చూడ్డానికి వ‌చ్చారు. అయితే, అకస్మాత్తుగా వారిద్దరూ కనిపించకుండా పోవడంతో గ్రామస్తులు వెతికారు.అపస్మారక స్థితిలో సమీపంలోని అడవిలో వారు కనిపించారని పోలీసులు తెలిపారు. ఎస్పీ నీరజ్ కుమార్ జదౌన్ తెలిపిన వివరాల ప్రకారం. శనివారం ఓ వివాహ బృందం తమ గ్రామానికి వచ్చిందనీ, అక్కడి నుంచి తన ఆరేళ్ల కుమార్తె, బావమరిది ఐదేళ్ల కుమార్తెను అపహరించి అత్యాచారానికి పాల్పడ్డారని ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గుర్తుతెలియని వ్యక్తిపై ఐపీసీ, పోక్సో చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

click me!