రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం: బస్సు, ట్యాంకర్ ఢీ 12 మంది సజీవ దహనం

Published : Nov 10, 2021, 12:14 PM ISTUpdated : Nov 10, 2021, 12:25 PM IST
రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం: బస్సు, ట్యాంకర్ ఢీ 12 మంది సజీవ దహనం

సారాంశం

రాజస్థాన్ రాష్ట్రంలో బుధవారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో 12 మంది సజీవ దహనమయ్యారు. బస్సు, ట్యాంకర్ ఢీకొన్న ప్రమాదంలో  మంటలు చెలరేగి 12 మంది మృత్యువాత పడ్డారు.

జైపూర్: రాజస్థాన్ రాష్ట్రంలో బుధవారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో 12 మంది సజీవ దహనమయ్యారు. బస్సు, ట్యాంకర్ ఢీకొన్న ప్రమాదంలో మంటలు చేలరేగాయి. దీంతో 12 మంది ఈ ప్రమాదంలో మరణించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 25 మంది ప్రయాణిస్తున్నారు. ప్రమాదస్థలం నుండి ఇప్పటివరకు 10 మృతదేహలను బయటకు తీశారు.ఈ ప్రమాదం జరిగిన విషయం  తెలియగానే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొన్నారు.  రాజస్థాన్ లోని  బార్మర్ -జోధ్‌పూర్ హైవేపై ప్రమాదం చోటు చేసుకొంది.

జిల్లా యంత్రాంగం హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొంది.  ఇవాళ ఉదయం 9:55 గంటల సమయంలో ప్రైవేట్ బస్సు 25 మంది ప్రయాణీకులతో బయలు దేరింది.ఈ సమయంలో ఎదురుగా వస్తున్న ట్యాంకర్ బస్సును ఢీకొట్టింది. దీంతో ట్యాంకర్ లో ఉన్న ఆయిల్ లీకై మంటలు వ్యాపించాయి. అయితే ఈ బస్సులో ప్రయాణీస్తున్న  మిగిలిన ప్రయాణీకుల గురించి సమాచారం లేదని పోలీసులు తెలిపారు.

PREV
click me!

Recommended Stories

పల్లెటూరిలో ప్రపంచ స్థాయి వైద్య సదస్సు.. దేశంలో తొలిసారి అంతర్జాతీయ కార్డియాక్ కాన్ఫరెన్స్
మెల్ బోర్న్ క్రికెట్ స్టేడియంలో మోదీ కి అదిరిపోయే వెల్ కమ్ | PM Modi visits Melbourne Cricket Ground