శరద్ పవార్ ఇంట కరోనా కలకలం, క్వారంటైన్ లో ఎన్సీపీ అధినేత

Published : Aug 18, 2020, 01:55 PM IST
శరద్ పవార్ ఇంట కరోనా కలకలం, క్వారంటైన్ లో ఎన్సీపీ అధినేత

సారాంశం

ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఇంట్లో కరోనా కలకలం చెలరేగింది. ఆయన నివాసం సిల్వర్ ఓక్స్ బంగ్లాలో పనిచేసే 12 మంది సిబ్బంది కరోనా పాజిటివ్ గా తేలడంతో... ఆందోళన నెలకొంది. 

కరోనా వైరస్ మహమ్మరి రోజు రోజుకి విజృంభిస్తుంది. సామాన్యుడు సెలబ్రిటీ అనే తేడా లేకుండా అందరిని వణికిస్తోంది. హోమ్ మంత్రి అమిత్ షా నుంచి మొదలుకొని రాష్ట్రాల ముఖ్యమంత్రుల వరకు ఎవ్వరిని వదలకుండా కరోనా వైరస్ వణికిస్తోంది. 

తాజాగా ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఇంట్లో కరోనా కలకలం చెలరేగింది. ఆయన నివాసం సిల్వర్ ఓక్స్ బంగ్లాలో పనిచేసే 12 మంది సిబ్బంది కరోనా పాజిటివ్ గా తేలడంతో... ఆందోళన నెలకొంది. 

సిబ్బందికి కరోనా సోకడంతో... శరద్ పవార్ బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో కరోనా పరీక్షలు చేపించుకున్నాడు. పరీక్షల్లో ఆయన నెగటివ్ గా తేలినట్టు మహారాష్ట్ర ఆరోగ్య శాఖామంత్రి తెలిపారు. 

పవార్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని, ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. ముందుజాగ్రత్త చర్యగా ఆయన నాలుగురోజులపాటు క్వారంటైన్ లో ఉండనున్నట్టుగా ఆయన తెలిపారు. 

పవార్ కుటుంబ సభ్యుల్లో కూడా అందరూ నెగటివ్ గానే తేలారు. పాజిటివ్ గా తేలిన వారిలో 10 మంది భద్రత సిబ్బందితోపాటుగా ఇద్దరు డ్రైవర్లు ఉన్నారు. వీరిలో ఎవరికీ కూడా కరోనా లక్షణాలు లేకపోవడం గమనార్హం. సీబంధంతా కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 

PREV
click me!

Recommended Stories

Nitin Nabin : బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మోదీ నమ్మిన బంటు.. ఎవరీ నితిన్ నబిన్?
Indian Railways : ఇండియన్ రైల్వే బంపర్ ఆఫర్.. తక్కువ ఖర్చుతో దేశమంతా తిరిగేయండిలా !