assam floods : అయ్యో అస్సాం.. వ‌ర‌ద‌ల‌తో మరో 12 మంది మృతి.. వేధిస్తున్న ఆహార‌, నీటి, మందుల కొర‌త

By Sumanth KanukulaFirst Published Jun 30, 2022, 4:19 PM IST
Highlights

అస్సాంను వరదలు ఆగమాగం చేస్తున్నాయి. అనేక ప్రాంతాలు గత కొన్ని రోజులుగా నీటిలోనే ఉన్నాయి. కనీసం నీరు, ఆహారం, మందులు కూడా సరిగా అందడం లేదు. ఈ వదల వల్ల దాదాపు 31 లక్షల మంది ప్రభావితం అయ్యారు. 

అస్సాం రాష్ట్రాన్ని వ‌ర‌ద‌లు వ‌ద‌ల‌డం లేదు. గురువారం ప‌రిస్థితి మ‌రింత దిగ‌జారింది. గ‌డిచిన 24 గంటల్లో 31 లక్షల మందికి పైగా ప్రజలు ఈ వ‌ర‌ద‌ల వ‌ల్ల ప్రభావితమయ్యారు. 12 మంది మ‌ర‌ణించారు. కాచర్ల సిల్చార్ పట్టణంలోని అనేక ప్రాంతాలు ప‌ద‌కొండు రోజుల పాటు నీటిలోనే ఉంటున్నాయి. గ‌త రెండు నెల‌ల నుంచి కొన‌సాగుతున్న వ‌ర‌ద‌లు, కొండ చ‌రియ‌లు విరిగిప‌డ‌టం వ‌ల్ల ఇప్ప‌టి వ‌ర‌కు 151 మంది మృతి చెందారు. 

రేపు కాదు, ఈ రోజే పట్టం.. మహారాష్ట్ర సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న ఫడ్నవీస్

ఈ వ‌ర‌ద‌ల వ‌ల్ల 26 జిల్లాల్లో ఇప్ప‌టి వ‌ర‌కు 31.54 ల‌క్ష‌ల మంది ప్ర‌భావితం అయ్యారు. అయితే బుధ‌వారం నాటికి ఈ సంఖ్య 24.92 లక్షలుగా ఉంది. బెకి, కోపిలి, బరాక్,  కుషియారాతో సహా అనేక చోట్ల బ్రహ్మపుత్ర నది ప్రమాద స్థాయి కంటే ఎక్కువగా ప్రవహిస్తున్నాయి. అయ‌తే ఇతర నదుల ప్ర‌వాహం తగ్గుముఖం పట్టాయి. సీఎం హిమంత బిస్వా శర్మ గురువారం డిప్యూటీ కమిషనర్‌లతో వర్చువల్ కాన్ఫరెన్స్ నిర్వహించి, బాధితులకు వీలైనంత త్వరగా సహాయాన్ని అందించాలని మరియు పునరావాసం కల్పించాలని కోరారు.వరదల వల్ల జరిగిన నష్టాలను త్వరితగతిన అంచనా వేయాలని, తద్వారా బాధిత ప్రజలకు తగిన నష్టపరిహారం చెల్లించాలని ఆయన ఆదేశించారు.

జూలై 15లోగా ప్రతి జిల్లాలో జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి టైమ్‌లైన్‌ను ఏర్పాటు చేశామని, జూలై 20లోగా రక్షణ మంత్రులు, కార్యదర్శులు ఆమోదం తెలుపుతారని, ఆ తర్వాత బాధిత ప్రజలకు పరిహారం పంపిణీ చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ ప్రక్రియ మొత్తం ఆగస్టు 15 నాటికి పూర్తవుతుందని భావిస్తున్నారు. కాగా ఇప్ప‌టికీ సిల్చార్ పట్టణంలోని అనేక ప్రాంతాలు నీటితో నిండి ఉండ‌టంతో బాధితులు ప‌రిస్థితి ఘోరంగా ఉంది. వారిని ఆహారం, తాగు నీరు, మందుల కొర‌త తీవ్రంగా వేధిస్తోంది. 

‘పతనం అక్కడే మొదలవుతుంది’.. అన్నయ్య ఉద్ధవ్ ఠాక్రేకు రాజ్ ఠాక్రే కౌంటర్!.. ఫ్యామిలీ ఫైట్?

ప‌ట్ట‌ణంలో నీటి కొర‌త‌కు కార‌ణం అయిన బేతుకుండి వద్ద తెగిపోయిన వాగు భాగానికి మరమ్మతులు నిరంతరం కొనసాగుతున్నాయని డిప్యూటీ కమిషనర్ కీర్తి జల్లి తెలిపారు.కాచర్ జిల్లా కటిగోరా రెవెన్యూ సర్కిల్ పరిధిలోని బర్జూరి వద్ద తెగిపోయిన వాగు మరమ్మతు పనులు కూడా కొనసాగుతున్నాయని ఆమె చెప్పారు. 28 మున్సిపల్‌ వార్డుల్లో ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నీటి సంబంధ వ్యాధుల నివారణకు వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని, బాధితులకు స్వచ్ఛమైన తాగునీరు, ఆహారం అందజేసేందుకు ప్రాధాన్యత ఇస్తున్నామని ఆమె తెలిపారు.

కాగా రాష్ట్రవ్యాప్తంగా 79 రెవెన్యూ సర్కిళ్ల పరిధిలోని 2,675 గ్రామాలు ప్రభావితమయ్యాయని, 3.12 లక్షల మంది ప్రజలు 560 సహాయ శిబిరాల్లో తలదాచుకున్నారని బులెటిన్‌లో పేర్కొంది. సహాయక శిబిరాల్లో తలదాచుకోని వరద బాధిత ప్రజలకు 280 డెలివరీ పాయింట్ల నుండి సహాయ సామగ్రిని పంపిణీ చేశారు. అత్యధికంగా ప్రభావితమైన జిల్లాల్లో మొత్తం 14.30 లక్షల జనాభాతో కాచర్, 5.49 లక్షలతో బార్‌పేట, 5.19 లక్షలతో నాగాన్ ఉన్నాయి. బిస్వనాథ్‌లో నాలుగు, లఖింపూర్‌లో ఐదు కట్టలు తెగిపడగా, 177 రోడ్లు, ఐదు వంతెనలు దెబ్బతిన్నాయి. ఈ బులెటిన్ ప్రకారం వరదల కారణంగా 548 ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి, 1,034 పాక్షికంగా దెబ్బతిన్నాయి.

click me!