ఘోర ప్రమాదం..ఒకే కుటుంబానికి చెందిన 12మంది మృతి

Published : Jan 29, 2019, 09:45 AM IST
ఘోర ప్రమాదం..ఒకే కుటుంబానికి చెందిన 12మంది మృతి

సారాంశం

రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 12మంది మృత్యువాత పడ్డారు. ఈ దారుణ సంఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకుంది. 


రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 12మంది మృత్యువాత పడ్డారు. ఈ దారుణ సంఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉజ్జయిని జిల్లా రామ్ గఢ్ సమీపంలో సోమవారం రాత్రి రెండు వాహనాలు ఢొకొన్నాయి.  ఈ ఘటనలో 12మంది అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు.

మరో ఇద్దరికి తీవ్రగాయాలు కాగా.. స్థానికులు వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారుగా గుర్తించారు. వీరంతా ఓ వివాహ వేడుకకు హాజరై వ్యాన్‌లో తిరిగి వస్తున్నారు. రామ్‌గఢ్‌లోని నగ్డా రోడ్డు వద్ద వేరే వాహనం వ్యాన్‌ను ఢీకొట్టడంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

MICE పథకం.. ఈ రంగంలో గేమ్‌ చేంజర్
రైళ్లలో ఇకపై లగేజీకి ఛార్జీలు:Ashwini Vaishnaw on Indian Railway Luggage Rules | Asianet News Telugu