కరోనా వైరస్... ఢిల్లికి చేరిన కర్నూలు జ్యోతి సహా.. 119మంది భారతీయులు

By telugu news teamFirst Published Feb 27, 2020, 10:04 AM IST
Highlights

రాజధాని టోక్యో నుంచీ 119 మందితో ఓ విమానం ఢిల్లీకి వచ్చింది. ఇక చైనాలోని వుహాన్ నుంచీ 76 మంది... ప్రత్యేక విమానంలో ఢిల్లీ ఎయిర్‌‌పోర్ట్‌కి వచ్చారు. ఈ రెండు విమానాల్లో మరో 45 మంది విదేశీయులు కూడా ఉన్నారు. ఈ మొత్తం మందిలో... ఇద్దరు తెలుగు వారు కూడా ఉన్నారు.
 

కరోనా వైరస్ రోజు రోజుకీ విజృంభిస్తోంది. చైనాలోని వుహాన్ లో మొదలైన ఈ వైరస్ ప్రపంచంలోని చాలా దేశాలకు పాకేసింది. ఇదిలా ఉండగా.. ఈ వైరస్ కారణంగా చైనా, జపాన్ లో ఉండిపోయిన దాదాపు 119మంది భారతీయులు సురక్షితంగా ఢిల్లీ చేరుకున్నారు. కేంద్ర ప్రభుత్వం చొరవతో వారందరినీ ఢిల్లీకి చేర్చారు.

 రెండు విమానాల్లో వీరంతా ఢిల్లీకి చేరారు. జపాన్‌లోని... రాజధాని టోక్యో నుంచీ 119 మందితో ఓ విమానం ఢిల్లీకి వచ్చింది. ఇక చైనాలోని వుహాన్ నుంచీ 76 మంది... ప్రత్యేక విమానంలో ఢిల్లీ ఎయిర్‌‌పోర్ట్‌కి వచ్చారు. ఈ రెండు విమానాల్లో మరో 45 మంది విదేశీయులు కూడా ఉన్నారు. ఈ మొత్తం మందిలో... ఇద్దరు తెలుగు వారు కూడా ఉన్నారు.

వారిలో జ్యోతి కూడా ఉంది. జ్యోతిని ఢిల్లీలో 15 రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచి వైద్య పరీక్షల తర్వాత కర్నూలు జిల్లాలకు పంపనున్నారు. టీసీఎల్ కంపెనీలో శిక్షణ నిమిత్తం జ్యోతి చైనాలోని వూహాన్‌కు వెళ్లింది. కాగా కరోనా వైరస్ ప్రభలడంతో అక్కడకు వెళ్లిన భారతీయులు తిరుగుముఖం పట్టారు. 

Also Read చైనా విమానాలకు కరోనా వైరస్.... 2లక్షల కోట్ల నష్టం అంచనా....

అయితే జ్యోతికి తీవ్రమైన జ్వరం రావడంతో కరోనా వైరస్ సోకిందనే అనుమానంతో ఆమెను అక్కడే ఉంచేశారు. దీంతో ఆమె కుటుంబసభ్యులు ఆందోళనకు గురయ్యారు. జ్యోతిని స్వదేశానికి తీసుకురావాల్సిందిగా ఆమె కుటుంబసభ్యులు రాజకీయ నేతలను, ఎంబసీ అధికారులను కోరారు. అయినప్పటికీ తీవ్ర జాప్యం జరిగింది. 

అయితే మార్చిలో జ్యోతి పెళ్లి ఉండటంతో అప్పటి వరకు వస్తుందో లేదో అన్న సంశయంలో ఉండగా ఎట్టకేలకు ఆమె ఈరోజు స్వదేశానికి చేరడంతో కుటుంబసభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 
 

click me!