ప్రజా మరుగుదొడ్లలో బాంబు పేలడంతో ఓ 11యేళ్ల చిన్నారి మృతి చెందిన ఘటన పశ్చిమబెంగాల్ లో విషాదం నింపింది.
పశ్చిమబెంగాల్ : సోమవారం నాడు పశ్చిమబెంగాల్లో మరుడుదొడ్లలో బాంబు పేలుళ్లు కలకలం సృష్టించాయి. ఉత్తర 24 పరగణ జిల్లాలో ఓ బాంబు పేలింది. ఈ పేలుడులో 11 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. బాన్ గా టౌన్ పరిధిలోని బక్షపల్లి ప్రాంతంలోని సైకిల్ గ్యారేజీలో ఆ బాలుడు పనిచేస్తున్నాడు. మరుగుదొడ్డిలో పేలుడు సంభవించడంతో రాజు రాయి అనే ఆ చిన్నారి ఈ బాంబు పేలుడులో మృతి చెందాడు.
సోమవారం ఉదయం ఎనిమిది గంటల సమయంలో.. రాజు రాయ్ ప్రజా మరుగుదొడ్డిని ఉపయోగించుకుంటున్నాడు. ఆ సమయంలో అకస్మాత్తుగా బాంబు పేలింది.. దీంతో ఆ బాలుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. పెద్ద శబ్దం వినిపించడంతో అక్కడే ఉన్న బాలుడు తండ్రి ప్రశాంత్ రాయ్ కంగారుపడి వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నాడు. కానీ అప్పటికే.. బాంబు పేలుడికి కుమారుడు బలయ్యాడు.
నీలిచిత్రాలకు బానిసై.. ఆరుగురు బాలికలపై ప్రిన్సిపాల్ ఆఘాయిత్యం..
రక్తపు మడుగులో పడిన కొడుకుని చూసి కన్నీరు మున్నీరు అవుతున్నాడు. వెంటనే సమాచారం అందడంతో బాంబు స్క్వాడ్ అక్కడికి చేరుకుంది. వారు పరిసరాలను పరిశీలించగా మరో ఎనిమిది గ్రానైట్లు ఆ మరుగుదొడ్లలో ఉన్నట్లు గమనించారు. వాటిని స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఈ ఘటన ఎలా జరిగిందన్న విషయం మీద ఇంకా స్పష్టత రాలేదు. బన్ గావ్ మున్సిపాలిటీ చైర్ పర్సన్ గోపాల్ సేథ్ మాట్లాడుతూ.. అక్కడ ఆరు బాంబులు పేలినట్లుగా తెలిపారు.