నీలిచిత్రాలకు బానిసై.. ఆరుగురు బాలికలపై ప్రిన్సిపాల్‌ ఆఘాయిత్యం.. 

By Rajesh Karampoori  |  First Published Jun 6, 2023, 6:36 AM IST

నీలి చిత్రాలకు బానిసైన ఓ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఏకంగా ఆరుగురు మైనర్‌ విద్యార్థినులపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన రాజస్థాన్‌లోని దుంగార్‌పూర్‌లో వెలుగులోకి వచ్చింది. 


రాజస్థాన్‌లోని దుంగార్‌పూర్‌లో బాలికలపై అత్యాచారం కేసులో కలకలం రేగింది. ఇక్కడ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఆరుగురు బాలికలపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అదే సమయంలో ఓ బాలిక ప్రైవేట్ పార్ట్ ను గాయపడిన విషయం కూడా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం నిందితుడిని దుంగార్‌పూర్ జిల్లా సదర్ పోలీస్ స్టేషన్ పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. అనంతరం అతడిని పోలీసు రిమాండ్‌కు తరలించారు.

పోలీసుల దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడిని విచారించగా.. ఆరుగురు బాలికలపై అత్యాచారం చేశాడన్న ఆరోపణలను అంగీకరించినట్లు డీఎస్పీ రాకేశ్ శర్మ తెలిపారు. తాను నీలి చిత్రాలను అడిక్ట్ అయ్యాయని కూడా చెప్పాడు. వాటిని చూసిన తరువాత ఒక్కో బాలికపై అత్యాచారం చేసినట్టు వెల్లడైంది.

Latest Videos

ప్రధానోపాధ్యాయుడు రమేష్ చంద్ర కటారాకు రెండు ఇళ్లు ఉన్నాయని, అందులో ఒకటి నిర్మాణంలో ఉందని కూడా వెలుగులోకి వచ్చింది. అక్కడ ఎవరూ లేకపోవడంతో అమ్మాయిలను అక్కడికి తీసుకెళ్లేవాడని పోలీసుల విచారణలో వెల్లడైంది. అలాగే.. అతడి రెండు మొబైల్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దానితో పాటు బాలికలను ఇంటికి తీసుకెళ్లే స్కార్పియో వాహనాన్ని కూడా సీజ్ చేశారు. ఇప్పుడు నిందితుడి ఇల్లు, వాహనం, పాఠశాలను పోలీసులు వెరిఫై చేస్తున్నారు.
 
సదర్ పోలీస్ స్టేషన్‌లో 12 ఏళ్ల బాలిక తన తల్లిదండ్రులతో కలిసి నివేదిక సమర్పించింది. పాఠశాలకు సెలవులు కొనసాగుతున్నాయని, అయినా.. ప్రధానోపాధ్యాయుడు పాఠశాలకు పిలిచి.. అనంతరం తన కారులో ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ ప్రైవేట్ పార్ట్ పై వేధింపులకు పాల్పడుతూ నీచమైన పని చేశాడు. పోలీసులు అతనిపై పోక్సో చట్టం కింద కేసు పెట్టి అరెస్టు చేయగా కోర్టు రిమాండ్‌ విధించింది.  

ఇదిలా ఉంటే.. ఈ ఘటనతో స్థానికంగా  రాజకీయ దుమారం చెలరేగింది. ఇక్కడ శాంతిభద్రతల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ మండిపడుతోంది. రాజ్‌సమంద్ ఎంపీ దియా కుమారి..  ఆరోపణలు ఎదుర్కొంటున్న హెడ్ మాస్టర్‌కు రక్షణ ఉన్నారని ఆరోపించారు. 

click me!