ఛత్తీస్‌గఢ్‌ : మందుపాతర పేల్చిన మావోయిస్టులు.. 11 మంది జవాన్లు మృతి

Siva Kodati |  
Published : Apr 26, 2023, 03:16 PM ISTUpdated : Apr 26, 2023, 06:46 PM IST
ఛత్తీస్‌గఢ్‌ : మందుపాతర పేల్చిన మావోయిస్టులు.. 11 మంది జవాన్లు మృతి

సారాంశం

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు రెచ్చిపోయారు. దంతేవాడ జిల్లాలో మందుపాతర పేల్చడంతో 11 మంది పోలీసులు మృతి చెందారు. 

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు రెచ్చిపోయారు. దంతేవాడ జిల్లాలో జవాన్లతో వెళ్తున్న మినీబస్సును మందుపాతర పెట్టి పేల్చడంతో 11 మంది జవాన్లు మృతి చెందారు. మృతులను డిఫెన్స్ రీసెర్చ్ గ్రూప్‌నకు చెందినవారిగా గుర్తించారు. మృతుల్లో 10 మంది డీఆర్జీ జవాన్లు, ఒక డ్రైవర్ వున్నట్లుగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు , ఇతర భద్రతా బలగాలు ఆ ప్రాంతానికి చేరుకున్నాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించేందుకు గాను రాయ్‌పూర్ నుంచి హెలికాఫ్టర్‌ బయల్దేరింది.  దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.  

 

 

ప్రతి ఏడాది 400 మందికి పైగా మావోయిస్టులు లొంగిపోతున్నారని బస్తర్ రేంజ్ ఐజీ సుందర్‌రాజ్ పీ చెప్పిన మరుసటి రోజే ఈ దాడి జరగడంతో భద్రతా దళాలు ఉలిక్కిపడ్డాయి. ఇంటెలిజెన్స్ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఆ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహించి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. ఛత్తీస్‌గఢ్ పోలీస్ ప్రత్యేక దళం డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (డీఆర్‌జీ)లో ఎక్కువగా పోలీసులు, మావోయిస్టులను ఎదుర్కోవడానికి శిక్షణ పొందిన స్థానిక గిరిజనులు వుంటారు.

గడిచిన రెండేళ్లలో భద్రతా బలగాలపై మావోయిస్టులు జరిపిన అతిపెద్ద దాడి ఇదే. పేలుడు జరిగిన ప్రాంతం రాష్ట్ర రాజధాని రాయ్‌పూర్‌కు 450 కిలోమీటర్ల దూరంలో వుంది. జాతీయ మీడియాలో వస్తున్న కథనాలను బట్టి.. పేలుడు జరిగిన ప్రదేశంలో దాదాపు 10 అడుగుల లోతులో గొయ్యి ఏర్పడగా, రోడ్డు మొత్తం చీలిపోయింది. దాడిలో వాహనం పూర్తిగా ధ్వంసమైంది. ఆ పక్కనే అమరవీరుల మృతదేహాలు కూడా చూడవచ్చు. 

ఈ ప్రాంతంలో దర్భా డివిజన్‌కు చెందిన మావోయిస్టులు వున్నట్లు సమాచారం అందడంతో భద్రతా సిబ్బంది దంతెవాడ జిల్లా కేంద్రం నుంచి బయలుదేరినట్లు ఐజీపీ తెలిపారు. ఈ క్రమంలో అక్కడ కూంబింగ్ ఆపరేషన్ పూర్తి చేసుకుని వారు మినీ గూడ్స్ వ్యాన్‌లో తిరిగి వస్తుండగా.. అరన్‌పూర్ - సమేలీ గ్రామాల మధ్య నక్సల్స్ దానిని పేల్చివేసినట్లు ఐజీపీ తెలిపారు. దీంతో పది మంది డీఆర్జీ జవాన్లు, డ్రైవర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పయినట్లు ఆయన వెల్లడించారు. ఘటనాస్థలికి భారీగా బలగాలను పంపి.. అనంతరం మృతదేహాలను తరలిస్తున్నట్లుగా తెలిపారు. దాడికి పాల్పడ్డ మావోయిస్టుల కోసం భద్రతా సిబ్బంది ఆ ప్రాంతంలో భారీగా సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నట్లు ఐజీపీ వెల్లడించారు. 

వామపక్ష తీవ్రవాదానికి కేంద్రమైన బస్తర్, దంతేవాడ, సుక్మా జిల్లాల్లో తిరుగుబాటుదారులపై అనేక విజయవంతమైన ఆపరేషన్లలో డీఆర్‌జీ కీలకపాత్ర పోషించింది. ఆరు దశాబ్ధాలుగా వందలాది మందిని బలిగొన్న మావోయిస్ట్ ఉద్యమం ఈ ప్రాంతంలో రక్తపుటేర్లను పారించింది. 1967 నుంచి భారతదేశంలోని మధ్య, తూర్పు ప్రాంతాలపై మావోయిస్టులు నియంత్రణను సంపాదించారు. దీనిని ‘‘రెడ్ కారిడార్’’ అని పిలుస్తారు. 

 

PREV
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌