అటెంప్ట్ మర్డర్ కేసులో 11 మంది మహిళలను జ్యుడీషియల్ కస్టడీకి పంపిన కోర్టు.. అసలేం జరిగిందంటే?

Published : Jan 07, 2023, 01:25 PM IST
అటెంప్ట్ మర్డర్ కేసులో 11 మంది మహిళలను జ్యుడీషియల్ కస్టడీకి పంపిన కోర్టు.. అసలేం జరిగిందంటే?

సారాంశం

కేరళలోని 11 మంది మహిళలను హత్యా ప్రయత్నం కేసులో ఓ కోర్టు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. వీరంతా కలిసి ఓ వ్యక్తి, అతని కుటుంబంపై దాడికి దిగారు. చర్చి పాస్టర్ ఫొటోను మార్ఫ్ చేసినట్టు సదరు వ్యక్తిపై ఆరోపణలు ఉన్నాయి.  

తిరువనంతపురం: కేరళలోని ఓ కోర్టు 11 మంది మహిళలను జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. హత్యా ప్రయత్నం కేసులో వారిని కస్టడీకి పంపింది. వీరంతా ఓ వ్యక్తి, ఆయన కుటుంబంపై మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. ఓ చర్చి పాస్టర్ ఫొటోను మార్ఫింగ్ చేశాడన్న ఆరోపణలు గల వ్యక్తిపై వీరంతా దాడికి దిగారు. ఈ ఘటన కేరళలోని త్రిస్సూరులో ఎంపెరర్ ఇమ్మాన్యుయెల్ రిట్రీట్ సెంటర్ దగ్గర చోటుచేసుకుంది.

షాజి అనే వ్యక్తి పాస్టర్ ఫొటోను మార్ఫింగ్ చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. అంతకు ముందు షాజి అదే చర్చికి వచ్చేవాడు. ఆ చర్చికి రావడం మానేసిన తర్వాత అక్కడ బోధనలు చేసే పాస్టర్ చిత్రాన్ని మార్ఫ్ చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. వాటిని అనేక సోషల్ మీడియా వేదికల్లో షేర్ చేసినట్టు కథనాలు వచ్చాయి.

షాజి పై చర్చి అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదైంది. ఆలూర్ పోలీసులు షాజిపై కేసు నమోదు చేశారు. 

Also Read: ఆలయం నుంచి మహిళను జుట్టు పట్టుకున్ని బయటకు ఈడ్చుకెళ్లారు.. ఎందుకంటే? (వీడియో)

ఈ కేసు దర్యాప్తు జరుగుతుండగానే అతనిపై దాడి జరిగింది. షాజి, తన భార్య అశ్లిన్, కొడుకు సాజన్, బంధువులు ఎడ్విన్, అన్విన్‌లను కారులో నుంచి బయటకు లాగి మరీ ఆ మహిళలు దాడి చేశారు. ఈ దాడికి సంబంధించే కేరళలోని చాలక్కూడీ కోర్టు 11 మంది మహిళలకు జ్యుడీషియల్ కస్టడీకి పంపే ఆదేశం ఇచ్చింది. ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

PREV
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం